ముగిసిన చిరు అప్డేట్ల పర్వం.. ఆర్డర్ పై ఓ లుక్కేద్దాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఆయన నటించబోయే చిత్రాల సంబందించిన అప్డేట్స్ తో ఫ్యాన్స్ లో జోష్ కనిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలను చిరు లైన్ లో పెట్టారు. ఇప్పటికే ఆచార్య (చిరు 152) సినిమాను పూర్తి చేసిన చిరు.. విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తరువాత చిరు చేయబోయే సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి.
చిరు 153 – గాడ్ ఫాదర్:
చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రాన్ని మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘లూసీఫర్’కి రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి ‘గాడ్‌ఫాదర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకి తమన్ స్వరాలందిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Also Read
- మనం రోడ్డుపై చూసి వదిలేసే 'బిచ్చగాళ్ల' వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్‌డాగ్' టీజర్!
- Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్‌చరణ్
- Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
చిరు 154 – బాబీతో సినిమా
చిరు 154 సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా, బాబీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నారు. ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలనలో వుంది. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే రానున్నాయి.
చిరు 155 – బోళా శంకర్
చిరు 155వ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘వేదాళం’ కి రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి ‘బోళా శంకర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇదే క్రమంలో తాజాగా అన్న – చెల్లెలి అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా మెగాస్టార్ భోళా శంకర్ చిత్రంలో ఆయన చెల్లిగా కీర్తి సురేశ్ నటిస్తున్నట్టు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!