Chiranjeevi: వాల్తేరు వీరయ్య రంగంలోకి దిగిపోయాడు. మొన్నటివరకు రిలీజ్ డేట్ ప్రకటించలేదు.. ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు అంటూ అభిమానులు ట్రోల్స్ చేయడంతో ఎట్టకేలకు మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించారు. జనవరి 13 న వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక రిలీజ్ డేట్ ప్రకటించడంతో చిరు ప్రమోషన్స్ ను షురూ చేశాడు. హీరోయిన్ శృతిహాసన్ తో పాటు యూరప్ లో ల్యాండ్ అయ్యాడు చిరు.
ఇక షూటింగ్ గ్యాప్ లో ఫ్యామిలీతో కొద్దిగా సమయం గడపవచ్చు అని కుటుంబాన్ని కూడా తోడు తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని చిరునే స్వయంగా ట్వీట్ చేశాడు. ఒకపక్క భార్య సురేఖ, కూతురు సుష్మితతో పాటు మనవరాళ్లతో కలిసి ఉన్న ఫోటోను.. ఇంకోపక్క వాల్తేరు వీరయ్యలో తన సరసన నటిస్తున్న శృతి హాసన్ తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ” ఫ్యామిలీతో అటు విహారయాత్ర.. హీరోయిన్ తో ఇటు వీరయ్య యాత్ర” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో చిరు సంక్రాంతి విన్నర్ గా నిలుస్తాడో లేదో చూడాలి.
megastar-chiranjeevi-tweet-viral-social-media