Chiranjeevi : హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనర్ నియామకం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే అందజేసి కంగ్రాట్స్ చెప్పారు. ఇద్దరూ కాసేపు శాంతిభద్రతలు, హైదరాబాద్ సమస్యల గురించి మాట్లాడుకున్నారు. సజ్జనార్ కు చిరంజీవితో ఎంతో అనుబంధం ఉంది. ఇద్దరూ అనేక అంశాలపై అవేర్ నెస్ కల్పించారు. మొన్నటి వరకు ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ సేవలందించారు. ఇప్పుడు మళ్లీ పోలీస్ యూనిఫామ్ వేసుకోవడంతో చిరంజీవి వెళ్లి కలిశారు.
Read Also : Nadiya : 12వ తరగతిలోనే ప్రేమలో పడ్డా.. పవన్ అత్త నదియా కామెంట్స్
ఆర్టీసీ ఎండీగా ఎంతో గుర్తింపు పొందని సజ్జనార్.. పోలీస్ డ్రెస్ వేసుకున్న వెంటనే అనేక అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. హైదరాబాద్ లో నేరాల అదుపు, డ్రగ్స్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాల నిర్మూలన, యాక్సిడెంట్లు తగ్గించడం కోసం కీలక ఆదేశాలు ఇస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా షూటింగ్ దాదాపు దగ్గరకు వచ్చేసింది. దీన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Read Also : Ram Charan : ప్రధాని మోడీని కలిసిన రామ్ చరణ్ దంపతులు
