లవ్, ఫైట్స్, ఫ్రెండ్షిప్, బ్రదర్ సెంటిమెంట్, యాక్షన్, కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్, సూపర్ సాంగ్స్, గూస్ బంప్స్ తెచ్చే ఎలివేషన్స్… ఇలాంటి ఏ ఎమోషన్స్ ని బేస్ చేసుకోని పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ రాస్తే ఏ సినిమా అయినా సూపర్ హిట్ అవుతుంది అలాంటిది అన్ని ఎమోషన్స్ ఒకే సినిమాలో ఉంటే ఆ మూవీ ఇంకెంత హిట్ అవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చిరు నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా అలాంటిదే. ఇందులో ఫైట్స్ వేనుమా ఫైట్స్ ఇరుకు. లవ్ వేనుమా లవ్ ఇరుకు, ఎమోషన్ వేనుమా ఎమోషన్ ఇరుకు, సాంగ్స్ వేనుమా సాంగ్స్ ఇరుకు. ఆల్ ఎలిమెంట్స్ వన్ ఫిల్మ్, అదిదా గ్యాంగ్ లీడర్. 1991లో విజయ బాపినీడు దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ పైన నిర్మించిన గ్యాంగ్ లీడర్ సినిమా ప్రాపర్ కమర్షియల్ సినిమా అనే పదానికి కేరాఫ్ అడ్రెస్ లా ఉంటుంది. బిప్పి లహరి ఇచ్చిన సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. విజయశాంతి, చిరుల లవ్ ట్రాక్… మురళి మోహన్-శరత్ కుమార్-చిరంజీవిల మధ్య బ్రదర్ ఎమోషన్ గ్యాంగ్ లీడర్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. ఈ మూవీలో రావు గోపాల్ రావ్ ప్లే చేసిన నెగటివ్ రోల్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
Unstoppable: ఇక సోషల్ మీడియా మోత మొగిపోవాలి…
అప్పట్లో 100 రోజులు 50 కేంద్రాల్లో ఆడిన గ్యాంగ్ లీడర్ సినిమా 7కోట్ల డిస్ట్రిబ్యుటర్ షేర్ ని రాబట్టింది అంటే గ్యాంగ్ లీడర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ మూవీ 100 డేస్ వేడుక జరిగిన సమయంలో తీసిన క్రౌడ్ విజువల్స్ ని “అప్పుల అప్పారావు” సినిమాలో వాడుకున్నారు అంటే ఎంత మంది జనాలు 100 డేస్ ఫంక్షన్ కి వచ్చారో ఊహించొచ్చు. చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన గ్యాంగ్ లీడర్ సినిమాని రీరిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 11న గ్యాంగ్ లీడర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ అవ్వనుంది. ఫెబ్రవరి 17వరకూ పెద్ద సినిమాలు లేకపోవడం, ఫిబ్రవరి 11న మంచి సినిమాలు రిలీజ్ కాకపోవడంతో ఈ వన్ వీక్ గ్యాప్ ని గ్యాంగ్ లీడర్ సినిమా కాష్ చేసుకునే ఛాన్స్ ఉంది. గ్యాంగ్ లీడర్ సినిమాని ఆల్రెడీ థియేటర్స్ లో చూసిన వాళ్లు, ఆ మ్యాజిక్ ని మరోసారి విట్నెస్ చెయ్యడానికి థియేటర్స్ కి వెళ్ళండి. ఈ సినిమాని థియేటర్స్ లో మిస్ అయిన ఈ జనరేషన్ ఆడియన్స్… అసలు వింటేజ్ మెగాస్టార్ అనే వాడు ఎలా ఉంటాడో తెలుసుకోవడానికి ఫిబ్రవరి 11న గ్యాంగ్ లీడర్ సినిమా చూడండి.