Megastar Chiranjeevi comments on Mega Princess Birth: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు, వారికి మంగళవారం నాడు మహాలక్ష్మి జన్మించింది. ఇక ఈ క్రమంలో మెగా కుటుంబంలో కొత్త అతిధి ఎంట్రీతో ఆ కుటుంబ సభ్యులే కాక అభిమానుజుల్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ ఇంట ఆడ బిడ్డ జన్మించడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మనవరాలిని చూసేందుకు వెళ్లిన చిరు అనంతరం మీడియాతో మాట్లాడారు. చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కావాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశామని.. ఇప్పటికి ఆ భగవంతుడి దయతో మా ఆశ నెరవేరిందని అంటూనే ఆడబిడ్డ పుట్టుక మాకు అపురూపమని.. మా ఇంటిల్లిపాదీ ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పుకొచ్చారు.
Ram Charan Daughter: రాముడి జన్మ నక్షత్రంలోనే రామ్ చరణ్ కుమార్తె జననం!
అలాగే తాము నమ్ముకున్న ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజు మంగళవారం నాడే పాప జన్మించడం ఆనందకరం, మంచి ఘడియల్లో పుట్టిందని , పాప జాతకం కూడా అధ్బుతంగా ఉందంటున్నారని ఆయన అన్నారు. ఇక ఆ ప్రభావం ముందు నుంచి మా కుటుంబంలో కనబడుతుందని, చరణ్ కెరీర్ లో ఎదుగుదల, వరుణ్ ఎంగేజ్ మెంట్ ఇలా మా ఫ్యామిలీ లో అన్నీ శూభాలే జరుగుతున్నాయని ఆయన కామెంట్ చేశారు. ఐటీ ఇక మెగా వారసురాలికి ఎవరి పోలిక వచ్చింది అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే చిరంజీవి అప్పుడే చెప్పలేమని అన్నారు. చూశాను కానీ ఆ పోలికలు అప్పుడే చెప్పలేనని ఆయన అన్నారు. ఇక మంగళవారం ఉదయం 1.49 గంటలకు ఉపాసనకు పాప జన్మించగా అది శ్రీరాముని జన్మ నక్షత్రం అయిన పునర్వసు అని తెలుస్తోంది.