మెగాస్టార్ చిరంజీవి 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడించాడు. అమలాపురం నుంచి అమెరికా వరకు వీరయ్య దెబ్బకి కలెక్షన్ల వర్షం కురిసింది. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల ఫ్లాప్ తర్వాత కూడా తన ఇమేజ్ అండ్ మార్కెట్ డ్యామేజ్ కాలేదు అని ప్రూవ్ చేస్తూ చిరు వాల్తేరు వీరయ్య సినిమాతో నిరూపించాడు. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ నుంచి చిరు బయటికి వచ్చేసాడని మెగా ఫ్యాన్స్ అంతా ఖుషి అయ్యారు. ఇలాంటి సమయంలో చిరు, మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు, అది కూడా వేదాళం రీమేక్ అనగానే డై హార్డ్ మెగా ఫ్యాన్స్ కూడా అబ్బా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అవసరమా అనుకున్నారు. అందరూ భయపడినట్లే భోళా శంకర్ సినిమా మొదటి రోజు మార్నింగ్ షోకే నెగటివ్ టాక్ తెచ్చుకుంది. వాల్తేరు వీరయ్యతో కంబ్యాక్ ఇచ్చిన చిరుకి మెహర్ బిగ్గెస్ట్ ఫ్లాప్ ని ఇచ్చాడు. ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే మొదటి రోజు కన్నా రెండో రోజు 75% డ్రాప్ ఉంది.
ఈ మధ్య కాలంలో ఏ స్టార్ హీరో సినిమాకి కూడా ఈ స్థాయిలో డ్రాప్ కనిపించలేదు. భోళా శంకర్ ని జైలర్ మరింత దెబ్బ తీసింది. హిట్ టాక్ తో, సూపర్బ్ కలెక్షన్స్ తో జైలర్ సినిమా తెలుగు రాష్ట్రాల థియేటర్స్ కి కబ్జా చేసింది. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన జైలర్ సినిమా ఓవర్ ఫ్లోస్ ని చూస్తుంది. టికెట్స్ దొరక్క థియేటర్స్ పెంచమని సినీ అభిమానులు డిస్ట్రిబ్యూటర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ హిట్ ఇంపాక్ట్ భోళా శంకర్ సినిమాపై మరింత పడింది. అందుకే వీకెండ్ అయినా కూడా భోళా శంకర్ కోలుకునే పరిస్థితి కనిపించట్లేదు. బ్రేక్ ఈవెన్ మార్క్ చేరడానికి భోళా శంకర్ సినిమా ఇంకా 45 కోట్లకు పైగా రాబట్టాల్సి ఉంది. ప్రెజెంట్ ఉన్న టాక్ అండ్ ట్రెండ్ ని బట్టి చూస్తే భోళా శంకర్ భారీ నష్టాలని మిగిలించేలా కనిపిస్తోంది.