Mega Charan : మెగాస్టార్ – చరణ్.. ఆ రెండు ఫేక్.. ఫ్యాన్స్ హ్యాపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లైనప్స్ గురించి సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ‘దసరా’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ చుట్టూ ఇండస్ట్రీలో ఒక క్రేజీ రూమర్ తెగ వైరల్ అవుతోంది. చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల ఒక భారీ పీరియాడిక్ మాస్ డ్రామాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయిందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. అంతేకాకుండా, చిరంజీవితో కాకుండా రామ్ చరణ్ హీరోగా శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను రీ-ప్లాన్ చేస్తున్నారనే సరికొత్త ప్రచారం కూడా మొదలైంది.
మెగా కాంబోల గురించి వస్తున్న ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ తమ తమ మునుపటి కమిట్మెంట్స్ తో ఎంతో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో తన ప్రతిష్టాత్మక 158వ ప్రాజెక్ట్ చేస్తున్నారు . ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావడమే టార్గెట్ గా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నారు.
Also Read
- Mega 158 : చిరు - బాబీ సినిమాకు దాదాపు ఆ టైటిల్ ఫిక్స్ ?
- Jana Nayagan OTT Release: ఓటీటీలోకి దళపతి విజయ్ ‘జన నాయగన్’.. ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
- Captain India: కార్తీక్ ఆర్యన్ మూవీకి హీరోయిన్ ఫిక్స్.. 9 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి రీఎంట్రీ!
- Anaswara : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న యంగ్ హీరోయిన్
మరోవైపు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సైతం తన తదుపరి ప్రాజెక్ట్ తో బిజీగా గడుపుతున్నారు. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా ఆయన ‘ది పారడైజ్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ కమిట్మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాతే చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో అనుకున్న మెగా మాస్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమా ఆగిపోయిందనడంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే, ‘పెద్ది’ సినిమా షూటింగ్ తర్వాత ఆయన లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో తన 17వ చిత్రాన్ని (RC 17) చేయనున్నారు . ప్రస్తుతం సుకుమార్ ఈ ప్రాజెక్ట్ కోసం ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. వీరి కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘రంగస్థలం’ సినిమాను మించేలా ఈ కొత్త కథ ఉండబోతోందని టాక్. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తానికి చిరంజీవి, రామ్ చరణ్, శ్రీకాంత్ ఓదెల సినిమా గురించి నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్తలన్నీ కేవలం ఫేక్ న్యూస్ మాత్రమేనని తేలిపోయింది.
తాజావార్తలు
-
IND vs SL: గాలె టెస్టులో అంపైర్‌ను వణికించిన డీఎస్పీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్!
-
Mega 158 : చిరు – బాబీ సినిమాకు దాదాపు ఆ టైటిల్ ఫిక్స్ ?
-
Psychology Facts: రేపటి దుఃఖాన్ని ఈరోజే ఎందుకు అనుభవిస్తున్నాం? సైకాలజీ ఏం చెబుతోంది?
-
Jana Nayagan OTT Release: ఓటీటీలోకి దళపతి విజయ్ ‘జన నాయగన్’.. ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
-
America Vs Iran: డెడ్‌లైన్ ముగిసింది! యుద్ధమా? లొంగుబాటా?
ట్రెండింగ్
-
Sanjay Manjrekar: లైవ్‌లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్‌న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!