మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉపాసనలు లాస్ ఏంజిల్స్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లిన చరణ్ అండ్ ఫ్యామిలీ అక్కడ ఈవెంట్ ని కంప్లీట్ చేసుకోని తిరిగొచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చరణ్ కనిపించడంతో కెమెరా బగ్స్ క్లిక్ మన్నాయి. దీంతో సోషల్ మీడియా అంతా రామ్ చరణ్ ఫోటోలు, ఎయిర్పోర్ట్ లో చరణ్ కనిపించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎప్పటిలాగే చరణ్ ఆఫ్ లైన్ లుక్స్ లో చాలా కూల్ అండ్ స్టైలిష్ గా ఉన్నాడు. త్వరలో జరగనున్న #RC15 కొత్త షెడ్యూల్ లో చరణ్ జాయిన్ అవ్వనున్నాడు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రతి నెల రెండు వారాల పాటు షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పుడు జనవరి మొంత్ షెడ్యూల్ లో చరణ్ జాయిన్ అవ్వనున్నాడు. ఈ మూవీ నుంచి న్యూ ఇయర్ కి, సంక్రాంతికి అప్డేట్ వస్తుందని మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేశారు కానీ ఎలాంటి అప్డేట్ బయటకి రాలేదు.
ఈ పాన్ ఇండియా సినిమా ఫస్ట్ లుక్ ని జనవరి 26న రిపబ్లిక్ డే సంధర్భంగా గ్రాండ్ ఈవెంట్ చేసి మరీ లాంచ్ చేస్తారు అనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సోషల్ ఎలిమెంట్ టచ్ తో రూపొందుతున్న సినిమా కాబట్టి రిపబ్లిక్ డేకి అప్డేట్ తప్పకుండా వస్తుంది అనే మాటని మెగా అభిమానులు నమ్ముతున్నారు. మరి ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ భారి సినిమా ఫస్ట్ లుక్ ని జనవరి 26 అయినా బయటకి తెస్తారో లేదో చూడాలి. RC 15 షూటింగ్ అయిపోగానే చరణ్, బుచ్చిబాబు సనతో అనౌన్స్ చేసిన సినిమాపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందనుంది.