Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల నుంచి నిహారిక జొన్నలగడ్డగా మారిన విషయం తెల్సిందే. ఇక పెళ్లి తరువాత కూడా నిహారిక తనదైన పంథాలో కొనసాగుతోంది. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ లక్ లేకపోవడంతో రెండు సినిమాలకే పరిమితమయ్యింది.అయితే హీరోయిన్ గా సెట్ అవును తెలుసుకున్న ఈ బ్యూటీ నిర్మాతగా అవతారమెత్తింది. ఓటిటీ లో పలు వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ విజయవంతమైన నిర్మాతగా కొనసాగుతోంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇటీవలే నిహారిక ఒక వివాదంలో ఇరుక్కోవడం, దాని నుంచి బయటకు వచ్చాకా సోషల్ మీడియాకు దూరం కావడం చకచకా జరిగిపోయాయి. ఈ మధ్యనే మరోసారి ఇన్స్టాగ్రామ్ లో కి ఎంటర్ అయిన నిహారిక తన వెకేషన్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.
ఇక ఇటీవలే టర్కీలో ఆమె స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో అందరి ద్రుష్టి నిహారిక టాటూ మీద పడింది. ఎప్పుడు లేనిది ఈ వెకేషన్ లో నిహారిక బికినీ వేసుకొని కనిపించడం హీట్ పుట్టిస్తుంటే.. ఆ బికినీ లో ఈ టాటూ కనిపించి మరింత హీట్ ను పెంచేసింది. వీపు వెనక భాగంలో NK అనే అక్షరాలకు ఇరువైపులా సీతాకోక చిలుక రెక్కలు గా ఉన్న టాటూ ఆకట్టుకొంటుంది. NK అంటే నిహారిక కొణిదెల అని తెలుస్తోంది. అయితే ఇది ఈ మధ్యనే వేయించుకున్నది కాదు అని, ఐదేళ్ల క్రితమే నిహారిక వీపు మీద ఉన్నదని తెలుస్తోంది. బికినీలో కాబట్టి ఇంత క్లియర్ గా బయటపడిందని చెప్పుకొస్తున్నారు. కాగా, ప్రతి వెకేషన్ లో భర్త చైతన్య లేకపోవడం గమనార్హం. ఏది ఏమైనా నిహారిక ప్రస్తుతానికి లైఫ్ ఎంజాయ్ చేస్తుంది అనేది మాత్రం తెలుస్తోంది.