మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్ సినిమా అనౌన్స్ అవ్వగానే పాన్ ఇండియా బజ్ జనరేట్ అయ్యింది. దిల్ రాజు ప్రొడక్షన్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఈ మూవీ అంతే ఫాస్ట్ గా షూటింగ్ కూడా జరుపుకుంది. ఇంతలో శంకర్ ఇండియన్ 2 సినిమాని స్టార్ట్ చేసి గేమ్ ఛేంజర్ షూటింగ్ స్పీడ్ కి బ్రేకులు వేసాడు. నెలలో 12 రోజులు మాత్రమే షూటింగ్ అంటూ మెగా ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చాడు. ఇక్కడి నుంచి గేమ్ ఛేంజర్ సినిమాలో ఏం జరుగుతుందో? శంకర్ ఏం చేస్తున్నాడో? షూటింగ్ ఎక్కడి వరకూ వచ్చిందో అనే విషయంలో ఎవరి దగ్గర ఎలాంటి క్లారిటీ లేదు. జనవరి 26, ఆగస్టు 15, చరణ్ బర్త్ డే… ఇలా ఈవెంట్స్ అయిపోతూనే ఉన్నాయి కానీ గేమ్ ఛేంజర్ నుంచి ఒక్క అప్డేట్ కూడా బయటకి రావట్లేదు. ఒక పక్క నత్త నడకన జరుగుతున్న షూటింగ్, ఇంకో పక్కన బయటకి రాని అప్డేట్స్… మరోవైపు అయోమయంలో రిలీజ్ డేట్… ఈ మూడు చాలవు అన్నట్లు ఇప్పుడు లీకులు.
గేమ్ ఛేంజర్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎక్కడ షూటింగ్ జరిగినా ఎదో ఒక లీక్ బయటకి రావడం ఒక ఆనవాయితీగా మారింది. ఫ్యాన్స్ ఎక్కడ షూటింగ్ జరుగుతున్నా రామ్ చరణ్ లుక్ ని, సెట్ లుక్ ని, ఆర్టిస్టులని ఇలా ఎదో ఒకటి లీక్ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ‘జరగండి జరగండి’ అనే సాంగ్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఫోక్ స్టైల్ లో ఉన్న సాంగ్ ని థమన్ ఇచ్చిన ఊర కొట్టాడు మ్యూజిక్, ఆ రొట్ట లిరిక్స్ ఏంటో… అసలు ఆ లిరిక్స్ రాసింది ఎవర్రా అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సాంగ్ పైన నెగిటివ్ కామెంట్స్ చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. శంకర్ సినిమాలో సాంగ్స్ చాలా బాగుంటాయి, రామ్ చరణ్ మూవీలో కూడా సాంగ్స్ బాగుంటాయి. లీక్ అయిన ఈ సాంగ్ మాత్రం బేసిక్ వర్షన్ అయి ఉంటుంది, సింగర్స్ వచ్చి బీట్స్ అన్నీ సింక్ అయితే ఫైనల్ వర్షన్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికైతే శంకర్-దిల్ రాజు అండ్ టీమ్ ఇమ్మిడియట్ గా లీక్స్ ని ఆప్ ప్రయత్నం చేయాలి.