Site icon NTV Telugu

పిక్ : మెగా వారసులంతా ఒకే ఫ్రేమ్ లో… క్రిస్మస్ పార్టీ

Mega-Family

చాలా మంది మెగా అభిమానులు మెగా ఫ్యామిలీని ఒకే ఫ్రేమ్ లో చూసే అవకాశం కోసం ఎక్కువగా ఎదురు చూస్తుంటారు. ఇక మెగా కజిన్స్ అందరూ సందర్భానుసారంగా కలిసి సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక పండగలకి ఎలాగోలా మెగా హీరోలు, మెగా కజిన్స్ ఎక్కడో ఒక చోట కలుసుకుని కలిసి ఫోటో దిగేలా చూసుకుంటున్నారు. ఇటీవల కాలంలో అలాంటి ఫొటోలతో మెగా ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ కూడా ఇస్తున్నారు. తాజాగా మెగా వారసులంతా కలిసి ప్రేక్షకులను క్రిస్మస్ ట్రీట్ ఇచ్చిన పిక్ ఒకటి వైరల్ అవుతోంది. అందులో రామ్ చరణ్, తన భార్య ఉపాసన, అల్లు అర్జున్ సతీమతి స్నేహారెడ్డితో, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక ఆమె భర్త, శ్రీజ, వైష్ణవ్ తేజ్ తదితరులు ఒకే ఫ్రేమ్ కన్పించడం మెగా అభిమానులకు నిజంగానే పండగ మరి.

https://ntvtelugu.com/actress-faria-abdullah-participated-in-green-india-challenge/

ఇక అల్లు అర్జున్, రామ్ చరణ్ కలిసి పోజులిచ్చినప్పుడల్లా అది మెగా ఫ్యాన్స్ కు ఒక థ్రిల్. ఈరోజు క్రిస్మస్ వేడుకలను బన్నీ, చరణ్, వరుణ్తేజ్, సాయిధరమ్, వైష్ణవ్ సహా దాదాపు అందరు మెగా హీరోలు తమ ఇతర కజిన్స్, నిహారిక, సుస్మిత, శ్రీజ మరియు ఇతరులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్, అల్లు శిరీష్ మాత్రం ఈ పిక్ లో మిస్ అయ్యారు. గతంలో మెగా కజిన్స్ దీపావళి సెలెబ్రేషన్స్ లో, మరొక సందర్భంలో కూడా ఇదే విధంగా కలిసి పోజులిచ్చారు. అయితే కుటుంబ సభ్యులు ఐకమత్యంతో ఎలా నిలబడాలి అనేదానికి ఇదొక ఉదాహరణ.

Exit mobile version