Site icon NTV Telugu

Meera Chopra: మరోసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టిన పవన్ హీరోయిన్

Meera Chopra

Meera Chopra

బంగారం సినిమాలో  పవన్ సరసన నటించి మెప్పించిన హీరోయిన్ మీరా చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తరువాత అమ్మడికి ఆశించిన అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ కు మాకాం మార్చిన ఈ బ్యూటీ గతంలో ఎన్టీఆర్ పై అనుచిచిత వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.  ఒకానొక రోజు చిట్ చాట్ సెషన్ లో తెలుగులో మీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడగగా.. మహేష్ బాబు పేరు చెప్పిన మీరా.. అదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదని.. తాను అతని ఫ్యాన్ ను కాదని పేర్కొంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అమ్మడిపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో మీరాను ట్రోల్ చేస్తూ కామెంట్స్, మీమ్స్ చేయడంతో అమ్మడు ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇక ఇది అక్కడితో ఆగకుండా మీరాను బెదిరించేవరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెళ్లడంతో ఆమె పోలీసులను ఆశ్రయించడమే కాకుండా  తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయమహిళా కమిషన్ కి ఫిర్యాదు చేయడం అప్పట్లో పెను తుఫాన్ నే సృష్టించింది. ఇక కొన్ని రోజుల తరువాత గొడవ సద్దుమణగడంతో అభిమానులు సైలెంట్ అయ్యారు.

ఇక తాజాగా మరోసారి మీరా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని తట్టి లేపింది. మరోసారి అమ్మడు ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్ వేయడంతో అమ్మడు మరోమారు సోషల్ మీడియా ట్రెండింగ్ గా నిలిచింది. ఇక ఆమె ట్వీట్ చేస్తూ” సౌత్ ఇండియన్ యాక్టర్స్‌ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. వారి టాలెంట్‌, వినయం, ప్యాషన్‌ను చూసి మనం ఎంతో  నేర్చుకోవాలి ని తెలుపుతూ ప్రభాస్‌, అల్లు అర్జున్, రామ్‌ చరణ్‌, యష్ పేర్లను జోడిస్తూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది. అయితే పాన్ ఇండియా స్టార్లలో ఎన్టీఆర్ పేరును వదిలేసింది. ఇక దీంతో నిద్రపోతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని తట్టిలేపినట్లయ్యింది. పాన్ ఇండియా క్రేజ్ అందుకున్న తారక్ కు నువ్ పెట్టే ట్వీట్ వలన ఒరిగేదేమి లేదు అని కొందరు.. దీపికా పదుకొణె, అలియా భట్‌ వంటి స్టార్‌ హీరోయిన్లే తారక్ నటనకు ఫిదా అవుతుంటే.. జూనియర్ ఆర్టిస్ట్ కి కూడా పనికిరావు… నువ్వు  ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నావా..? అని మరికొందరు అమ్మడిని ఏకిపారేస్తున్నారు. ఇక మరోపక్క మీరా, చరణ్ కి మద్దతు ఇస్తుందని అంటూ తారక్ ఫ్యాన్స్, చరణ్ ఫ్యాన్స్ పై కూడా విరుచుకుపడుతున్నారు. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Exit mobile version