టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా ధమాకాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఫేం దర్శకుడు త్రినాథరావు దర్శకత్వం ‘మజాకా’ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమాగా రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, సాంగ్స్ కు మంచి స్పందన లభించింది. తాజాగా మజాకా ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్.
ట్రైలర్ విషయానికి వస్తే సందీప్ కిషన్, రావు రమేష్ తండ్రి కొడుకులుగా నటించగా వారికి జోడీలుగా రీతూ వర్మ, మన్మధుడు ఫేం అన్షు నటించారు. వీరి మధ్య జరిగే సరదా సన్నివేశాలతో ట్రైలర్ కట్ చేసారు మేకర్స్. ట్రైలర్ లోని ఆ అమ్మాయిని పడేయాలి అంటే మన్మధుడు లా ఉండాలి కానీ మీరు మనవడిని ఎత్తుకునే వాడిలా ఉన్నారు బాగా పేలాయి. ఇక చివర్లో వచ్చే జై బాలయ్య డైలాగులు ట్రైలర్ కే హైలెట్ అని చెప్పాలి. హైపర్ ఆది. మురళి శర్మ, శ్రీనివాస రెడ్డి తమ మార్క్ కామెడితో ఆకట్టుకున్నారు. లియో జేమ్స్ అందించిన నేపధ్య సంగీతం వినసొంపుగా గా ఉంది. ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా ఈ మహా శివరాత్రికి ఆడియెన్స్ ను నవ్వించానికి వస్తున్నాం అని ఈ నెల 26న రిలీజ్ డేట్ ను అన్న సంగతి చెప్పకనే చెప్పాడు. మొత్తానికి మజాకా ఔట్ అండ్ ఔట్ కామెడి ఎంటర్టైనర్ గా రాబోతుందని ట్రైలర్ చుస్తే తెలుస్తోంది.
Also Read : Ajith Kumar : రేసింగ్ లో ప్రమాదానికి గురైన అజిత్ కారు.