Little Hearts : సోషల్ మీడియాో ఇన్ ప్లూయెన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసి 90స్ వెబ్ సిరీస్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు మౌళి తనూజ్. ఇప్పుడు హీరోగా చేసిన లిటిల్ హార్ట్స్ మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేయగా.. శివానీ నగరం హీరోయిన్ గా చేసింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఇందులో మౌళి మాట్లాడుతూ.. నేను గతంలో ఓ రీల్ చేశాను. నీ హీరోకు ఆర్టీసీ క్రాస్ రోడ్డు రికార్డుందా.. మరెందుకురా నీకు అనేది. ఇప్పుడు నేను హీరోగా చేశాను. నాకు ఆర్జీటీ క్రాస్ రోడ్డు రికార్డు వచ్చింది అంటూ ఎమోషనల్ అయ్యాడు.
Read Also : Bigg Boss 9 : సెలబ్రిటీలకు అగ్నిపరీక్ష.. బిగ్ బాస్ దిద్దుబాటు చర్యలు
మనకు తెలిసిందే కదా.. గతంలో హీరోల ఫ్యాన్ వార్ ను ఇమిటేట్ చేస్తూ మౌళి ఈ రీల్ చేస్తే.. అది బాగా వైరల్ అయింది. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ సినిమాకు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో హౌస్ ఫుల్ బోర్డులు వేస్తున్నారని.. అందుకే తనకు ఆ రికార్డు దక్కిందన్నాడు మౌళి. నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. పాతికేళ్ల కుర్రాడు ఇండస్ట్రీ హిట్ కొట్టాడంటూ తెలిపాడు. ప్రేమలు సినిమా చూసిన తర్వాత.. మన ప్రాంతీయతకు తగ్గట్టు ఇలాంటి సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉండేదని.. అది ఈ సినిమాతో తీరిపోయిందన్నాడు బన్నీవాసు. ఇక మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ బాగానే చేసుకుంది. రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేశారు.
Read Also : Bigg Boss 9 : మరీ ఓవర్ చేసిన మాస్క్ మ్యాన్ హరీష్.. ఇంత అవసరమా..?