ఈరోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. బర్త్ విషెష్ చెప్తూ ట్వీట్స్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ కి మట్కా ప్రమోషనల్ వీడియోతో కిక్ ఇచ్చాడు వరుణ్ తేజ్. పలాస సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో వెట్రిమారన్ స్టైల్ సినిమాలు చేసే అతి తక్కువ మంది దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న కరుణ కుమార్… వరుణ్ తేజ్ ని కంప్లీట్ గా కొత్త లుక్ లో ప్రెజెంట్ చేస్తున్నట్లు ఉన్నాడు. మోహన్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్న మట్కా మూవీ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసారు.
మట్కా ఓపెనింగ్ బ్రాకెట్ అంటూ ఈ ఫస్ట్ ప్రమోషనల్ కంటెంట్ బయటకి వచ్చింది. హాలీవుడ్ సినిమా గాడ్ ఫాదర్, బాలీవుడ్ నుంచి వచ్చిన స్కామ్ 1992ల ఫీల్ ఇస్తూ మట్కా వీడియో ఆకట్టుకుంది. నిమిషమున్నర నిడివితో కట్ చేసిన ఈ వీడియోలో వరుణ్ తేజ్ మాఫియా డాన్ కైండ్ ఆఫ్ స్టైలిష్ మేకోవర్ లో కనిపిస్తున్నాడు. అనౌన్స్మెంట్ వీడియోలో చూపించిన విజువల్స్ ని బట్టి చూస్తే మట్కా మూవీ పీరియాడిక్ డ్రామాగా రూపొందినట్లు ఉంది. ఈ ఓపెనింగ్ బ్రాకెట్ వీడియోకి జీవీ ప్రకాష్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సో ఓవరాల్ గా మంచి కంటెంట్ తో మట్కా ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. వరుణ్ తేజ్ అండ్ టీమ్ ఇక్కడి నుంచి క్లీన్ గా ప్రమోషన్స్ చేసుకుంటూ వెళ్తే చాలు మట్కా వరుణ్ తేజ్ కెరీర్ లో ఒక మంచి సినిమా అయ్యే అవకాశం ఉంది.
PROMISE 😎
The Game has begun and The Bets are ON💥#MatkaOpeningBracket out now 🔥Happy Birthday Mega Prince @IAmVarunTej ❤️🔥#HBDVarunTej #Matka @KKfilmmaker @Meenakshiioffl #NoraFatehi @gvprakash @kishorkumardop #KarthikaSreenivasR @drteegala9… pic.twitter.com/NQh7MsBWih
— Vyra Entertainments (@VyraEnts) January 19, 2024