Matka Motion Poster Released: వైవిధ్యమైన చిత్రాలతో అలరిస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన 14వ చిత్రాన్ని ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నట్టు ఈరోజు ఉదయం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ పీరియాడిక్ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న #VT14 సినిమాను హైదరాబాద్‌లో టీమ్, పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. సురేష్ బాబు, చిత్ర నిర్మాతలు ప్రొసీడింగ్స్ ప్రారంభించేందుకు దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేయగా ముహూర్తం షాట్‌కు దర్శకుడు మారుతి కెమెరా స్విచాన్ చేశారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా దిల్ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. ఇక టైటిల్ పోస్టర్‌ను హరీష్ శంకర్ లాంచ్ చేయగా ‘మట్కా’అనే ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేశారు.
Sitara Ghattamaneni: లండన్ వీధుల్లో ఘట్టమనేని వారసురాలు..
ఇక ఈ సినిమా టైటిల్ పోస్టర్ ప్రత్యేకంగా ఆకట్టుకునేలా డిజైన్ చేయగా తాజాగా ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ షేర్ చేసింది. ఆ మోషన్ పోస్టర్ సినిమా మీద ఇంటరెస్ట్ పెంచేస్తోంది. ‘మట్కా’ అనేది ఒక రకమైన జూదం, 1958-1982 మధ్య జరిగే ఈ కథ యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నారు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు ఈ కథ వైజాగ్ నేపథ్యంలో జరుగుతుంది. 1958 నుంచి 82 వరకు సాగే కథలో వరుణ్ తేజ్ ని నాలుగు డిఫరెంట్ గెటప్ లలో చూడబోతున్నట్టు చెబుతున్నారు. వరుణ్ తేజ్ కెరీర్ లో హయ్యస్ట్ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌గా ఉండే ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ కంప్లీట్ గా మేక్ఓవర్ అవుతున్నారని తెలుస్తోంది. వరుణ్ తేజ్ కు జోడిగా నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి ఎంపికయ్యారు, ఈ పాన్ ఇండియా ఎంటర్ టైనర్లో నోరా ఫతేహి ఒక స్పెషల్ సాంగ్ లో కూడా అలరించనున్నారు.
A Realistic world where Money speaks the language of the streets💥
Presenting the Motion Poster of #MATKA ❤️🔥
– https://t.co/h8jBHSxLtA @IAmVarunTej @KKfilmmaker #Norafatehi @gvprakash @PriyaSeth18 @mohan8998 @drteegala9 @VyraEnts #MATKABegins pic.twitter.com/yZa7z9UGSQ
— Meenakshii Chaudhary (@Meenakshiioffl) July 27, 2023
నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం 60వ దశకంలో వైజాగ్‌ను తలపించే భారీ వింటేజ్ సెట్‌ను నిర్మించనున్నారని అలాగే. 60వ దశకంలోని వాతావరణాన్ని, అనుభూతిని అందించడానికి సినిమా యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక ఈ సినిమాకి ఆశిష్ తేజ ప్రొడక్షన్ డిజైనర్గా, సురేష్ ఆర్ట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి సౌత్‌లో అత్యంత బిజీగా ఉన్న కంపోజర్‌లలో ఒకరైన జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ప్రియాసేత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా వరుణ్ తేజ్‌కి మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ మట్కా సినిమా విడుదల కానుంది.