Site icon NTV Telugu

OG : ఓజీ నుంచి భారీ అప్డేట్.. మూడు రోజుల్లోనే..

Og

Og

OG : పవన్ కల్యాన్‌ హీరోగా వస్తున్న ఓజీపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. సుజీత్ డైరెక్షన్ లో వస్తన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే షూటింగ్ దాదాపు కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు మొదలు పెట్టేశారు. తాజాగా మూవీ నుంచి భారీ అప్డేట్ ఇచ్చారు. మూవీ నుంచి సెకండ్ సింగిల్ ను ఆగస్టు 27న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సువ్వి సువ్వి అనే సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో పవన్ కల్యాణ్‌, ప్రియాంక కనిపిస్తున్నారు.

Read Also : Ghaati : అనుష్కకు ఏమైంది.. ఎందుకు ఇలా చేస్తోంది..?

నీటిలో దీపాలను వదులుతూ అందంగా కనిపిస్తున్నారు. ఇది మెలోడీ సాంగ్ గా తెలుస్తోంది. ఇప్పటికే మూవీ నుంచి ఫైర్ స్ట్రోమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అది చాలా హీరోను ఎలివేట్ చేసే పవర్ ఫుల్ సాంగ్. ఇప్పుడు రెండో పాటను రిలీజ్ చేస్తున్నారు. ఈ సాంగ్ లో ఇద్దరూ చాలా అందంగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సాంగ్ తో మ్యాజిక్ క్రియేట్ చేస్తామని మూవీ టీమ్ చెబుతోంది. సెప్టెంబర్ మొదటి వారం నుంచే మూవీ ప్రమోషన్లు పెంచబోతున్నారు. ఇక సెప్టెంబర్ 29న మూవీ యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కాబోతున్నాయి.

Read Also : Peddi : ఆమె రామ్ చరణ్‌ కు తల్లా.. బుచ్చిబాబు ఏంటిది..?

Exit mobile version