తెలుగు సినిమాల్లో హీరో అంటే రాముడు మంచి బాలుడిలాగా ఉండాలి, ప్రజలకి మంచి చేయాలి, అందరి కోసం బ్రతకాలి… అప్పుడే అతను హీరో అనే మాట ఉండేది ఒకప్పుడు కానీ హీరో అంటే ఇవేమి అవసరం లేదు. హీరో మన పక్కింటి కుర్రాడిలా ఉంటాడు, మనం మాట్లాడుకున్నట్లే మాట్లాడుతాడు అని నిరూపించిన హీరో రవితేజ. ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుంటే నిలబడలేరు అనే మాటని లెక్క చేయకుండా… లేనట్టి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కూడా స్టార్ హీరో అవ్వొచ్చు అని నిరూపించాడు రవితేజ. ఈరోజు ఇండస్ట్రీ లోకి ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వస్తున్న ప్రతి ఒక్కరి ఇన్స్పిరేషన్ రవితేజ. ఒక హీరోలా కాకుండా రవితేజ, కామన్ పబ్లిక్ ఎలా మాట్లాడుకుంటారో… సినిమాలో అలానే డైలాగ్స్ చెప్తాడు. రాముడు మంచి బాలుడు అనే మాటని పూర్తిగా పక్కన పడేసి, హీరో అంటే ఇలానే ఉండాలి అనే లెక్కలు ఏమీ లేవని హిట్స్ కొట్టాడు.
డబ్బులు పెట్టి టికెట్స్ కొని థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేయకుండా ఎంటర్టైన్ చేయడం రవితేజకి మాత్రమే చెల్లింది. తన సినిమా హిట్ అయినా ఇంకో సినిమా చేస్తాడు, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా చేస్తాడు. సినిమాలు చేయడం తప్ప రవితేజకి ఇంకో పని తెలియదు. అంత పిచ్చి సినిమాల్లో ఉండడం, సినిమాలు చేయడం అంటే… ఇన్నేళ్ల కెరీర్ ఎలాంటి వివాదాలు లేకుండా, ఎలాంటి కాంట్రవర్సీల్లో ఇరుక్కోకుండా క్లీన్ కెరీర్ ని మైంటైన్ చేస్తున్న రవితేజని ఫ్యాన్స్ మాస్ మహారాజా అని ప్రేమగా పిలుస్తూ ఉంటారు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ తోనే మాస్ ని చూపించే రవితేజ లాంటి హీరో ఇంకొకరు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే లేడు. హీరో క్యారెక్టర్ ఇలానే ఉండాలి లాంటి లెక్కల్నే మార్చేసిన రవితేజ పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తూ ఉన్నారు.