Raviteja: రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు RT టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆద్యంతం ఆకట్టుకుంటున్న ట్రైలర్ భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక ట్రైలర్ ఈవెంట్ లో రవితేజ మాట్లాడుతూ..
“దర్శకుడు శరత్ అద్భుతమైన సినిమా తీశారు. ట్రైలర్ మీ అందరికీ నచ్చింది కదా.. నాకైతే చాలా నచ్చేసింది. శరత్ సినిమా చాలా బాగా తీశాడు. ఈ సినిమాపై వన్ పర్సెంట్ కూడా డౌట్ లేదు. సత్యన్ సూర్యన్, సామ్ సీఎస్ మిగతా టెక్నిషియన్లు అద్భుతంగా పని చేశారు.చాలామంది తమ్ముళ్లు వర్షం కారణంగా బయట ఉండిపోయారు. బయట ఉన్న తమ్ముళ్లకు కూడా ఏం చెప్తున్నాను అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుకుందాం. దివ్యాంశ కౌశిక్ అందంగా వుంది. ట్రైలర్ ఈవెంట్ కి వచ్చిన అనిల్ రావిపూడి మిగతా గెస్ట్ లకు థాంక్స్. మరిన్ని విషయాలు ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుకుందాం” అన్నారు