Masooda Trailer: గంగోత్రి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య, తిరువీర్ జంటగా సంగీత కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం మసూద. ఈ సినిమాకు సాయి కిరణ్ దర్శకత్వం వహిస్తుండగా.. మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి హిట్ సినిమాలు ఇచ్చిన స్వధర్మ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ ట్రైలర్ ను విజయ్ దేవరకొండ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు అయితే ప్యాంట్ తడిచిపోతుంది అనేలా ఉంది. ఇక కథ విషయానికొస్తే “సంగీత తన కూతురుతో ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఆ ఇంటిపైనే హీరో ఉంటాడు. హీరో ఆఫీస్ లో తన టీం లీడర్ ను ప్రేమిస్తూ ఆమెకు చెప్పలేక ఇబ్బంది పడుతుంటాడు.
ఇక ఎట్టకేలకు హీరో, హీరోయిన్ ప్రేమ చిగురించి ఇంటికి తీసుకొస్తాడు. అదే సమయంలో సంగీత అతడిని తన ఇంటికి తీసుకెళ్లి కూతురును చూపిస్తోంది. ఆమె ఎంతో వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. దీంతో ఆమెకు దెయ్యం పట్టిందని అర్ధమవుతోంది. ఆమెపై ఎవరో క్షుద్ర పూజ చేసారని, దాని నుంచి విడిపించాలంటే.. దెయ్యం పట్టిన అమ్మాయి రక్త సంబంధీకులైన ఇద్దరు మగవాళ్ల రక్తం కావాలని చెప్తాడు పూజారి. సంగీత తన కూతురు కోసం ఇందులోకి హీరోను లాగుతోంది.. అసలు సంగీత కూతురును పట్టుకున్నదెయ్యం ఎవరు..? మసూద కథ ఏంటి..? ఆమెకు, హీరోకు ఉన్న సంబంధం ఏంటి..? అనేది కథగా తెలుస్తోంది. ట్రైలర్ ను చూస్తుంటేనే భయంతో ప్యాంట్ తడిచిపోయేలా ఉంది.. ముఖ్యంగా ప్రశాంత్ విహారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా కనిపిస్తోంది. ఇకపోతే ఈ సినిమా ఈ నెల 18 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.