NTV Telugu Site icon

Masooda: మూడు భాషల్లో రాబోతున్న ‘మసూద’!

Masooda Movie

Masooda Movie

Masooda:’మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పుడు మూడో చిత్రంగా ‘మసూద’ను తెరకెక్కిస్తోంది. ఈ సంస్థ నుండి వచ్చిన తొలి చిత్రం ‘మళ్ళీ రావా’ లవ్ స్టోరీ కాగా, రెండో సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ థ్రిల్లర్ మూవీ. ఇప్పుడు ‘మసూద’ను హారర్ డ్రామాగా రూపొందిస్తోంది. ఈ మూవీ గురించి నిర్మాత నక్కా రాహుల్ యాదవ్ మాట్లాడుతూ, ”మనం ఒక మంచి హారర్ డ్రామాను చూసి చాలా కాలం అయ్యింది. మంచి హార్రర్ చిత్రాలలో ‘మసూద’ ఒకటిగా నిలుస్తుందని నా గట్టి నమ్మకం. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్‌కి, పోస్ట‌ర్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, త‌మిళంలో కూడా ఒకేసారి నవంబర్ 11న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. అతి త్వరలో ఇతర వివరాలను తెలియజేస్తాం” అని అన్నారు. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, ‘శుభలేఖ’ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Show comments