Masooda: కంటెంట్ ఉంటే చిన్న, పెద్ద అనే తేడా చూడరు ప్రేక్షకులు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు, ఎన్నో సినిమాలు నిరూపించాయి. ప్రస్తుతం మసూద సినిమా మరోసారి రుజువుచేసింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా మూడురోజుల్లో భారీ కలక్షన్స్ రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సంగీత, తిరువీర్, కావ్యా కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో సాయి కిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించింది. హర్రర్ కధాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. మొదటి నుంచి పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ సినిమా డే బై డే మంచి వసూళ్లను రాబడుతూ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది. మసూద సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలలో చాలా ఏరియాల్లో స్క్రీన్స్ పెంచారని తెలుస్తోంది.
ముఖ్యంగా నైజాం ఏరియా లో తన సత్తా ను కొనసాగిస్తోంది. నైజాం లో 3 రోజులకు 1.16 కోట్లు నెట్ (రూ. 63 లక్షల షేర్) వసూలు చేసింది. చిన్న సినిమాగా థియేటర్లో అడుగుపెట్టిన ఈ సినిమా పెట్టిందనికన్నా ఎక్కువగానే రాబట్టింది. ఇక ముందు ముందు ఈ సినిమా మరిన్ని వసూళ్లను అందుకొని రికార్డు కలక్షన్లను రాబడుతోంది అంటున్నారు. మరోపక్క హర్రర్ సినిమా కాబట్టి హార్ట్ వీక్ ఉన్నవాళ్లు రావొద్దని సినిమా చూసిన వారు సలహాలు ఇస్తున్నారు. నార్మల్ గా చూసిన వారికే ప్యాంట్ తడిచిపోతుందని, వీక్ హార్ట్ వారికైతే గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. అంటే.. అంత హర్రర్ ఉందని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ఒక చిన్న సినిమా ఇంత మంచి టాక్ ను అందుకోవడం అంటే నిజంగా ఆశ్చర్యమే అని చెప్పుకొస్తున్నారు.