Director Maruthi: ప్రేమలో అబ్బాయిల బాధ వర్ణనాతీతం.. అమ్మాయిలు ఈజీగా తీసుకుంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Director Maruthi: ఎన్ని జోనర్స్ వచ్చినా కూడా లవ్ స్టోరీస్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముఖ్యంగా బేబీ లాంటి సినిమాలకు మరింత డిమాండ్ ఉంది. అబ్బాయిల నిజమైన ప్రేమ కథలను బయటకు తీస్తున్నారు దర్శకులు. ఇక తాజాగా అలాంటి మరో సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. అదే ట్రూ లవర్. మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “ట్రూ లవర్”. ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాకు తెలుగులో మాస్ మూవీ మేకర్స్, మారుతి టీమ్ ప్రొడక్షన్ పై స్టార్ డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ ప్రెజెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఇక ఈ ట్రైలర్ ఎవెన్త్ లో డైరెక్టర్ మారుతీ మాట్లాడుతూ.. ” ట్రూ లవర్ సినిమా చూస్తుంటే నేను ఎర్లీ డేస్ లో చేసిన ఈ రోజుల్లో, బస్ స్టాప్ వంటి సినిమా మూవీస్ గుర్తొచ్చాయి. అప్పటి నుంచి ఇవాళ ప్రభాస్ గారితో రాజా సాబ్ సినిమా చేసేంత వరకు రావడం హ్యాపీగా ఉంది. ప్రేమలో అమ్మాయిలు బాధను ఈజీగా తీసుకుంటారేమో గానీ అబ్బాయిల బాధ వర్ణనానీతం అని చెప్పొచ్చు. తన లవర్ ఎక్కడికి వెళ్తుంది, ఎవర్ని కలుస్తుంది అనేది ఎవరు చూసినా చూడకున్నా..ప్రేమించిన వాడు అబ్జర్వ్ చేస్తుంటాడు. తన ప్రేయసిని మరొకరు ఎవరైనా ట్రాప్ చేస్తారేమో భయపడతాడు. ఈ విషయంలో అమ్మాయిలు తప్పేం లేదు. వాళ్లకు స్నేహాలు ఉండొచ్చు. స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. ఈ సినిమాలో ఎవరిదో ఒకరిది తప్పని చూపించలేదు. ఒక జంట మధ్య ఏర్పడిన పరిస్థితుల వల్ల ఒక ప్రేమికుడు తన ప్రేమను కాపాడుకునేందుకు ఏం చేశాడు అనేది ఈ సినిమా. ఈ కథను హార్ట్ టచింగ్ గా తెరకెక్కించారు దర్శకుడు ప్రభురామ్ వ్యాస్. ఆరేళ్లు కష్టపడి ఈ స్క్రిప్ట్ రాశానని డైరెక్టర్ చెప్పాడు. అతని అనుభవంలో నుంచే ఈ కథ వచ్చిందని అనుకుంటా. లేకుంటే ఇంత పర్పెక్ట్ గా సీన్స్ రావు. ట్రూ లవర్ సినిమాను తెలుగు ప్రేక్షకులు మిస్ కారని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే కారణం ఆ రోజుల్లో ఈ రోజుల్లో అనే సినిమా తీయడమే. ఎ ఫిల్మ్ బై అరవింద్ కు కో ప్రొడ్యూస్ చేసిన తర్వాత నన్ను నిలబెట్టిన సినిమా ప్రేమిస్తే. అప్పటి నుంచి ఏ భాషలో మంచి లవ్ స్టోరీ వచ్చినా ఆడియెన్స్ కు నచ్చుతుందంటే మిస్ కాను. అలాంటి సినిమానే ట్రూ లవర్. ఈ సినిమాకు మీ లవర్స్ ను తీసుకెళ్లండి. మీరు మీ బాధ చెప్పనక్కర్లేదు. ఈ సినిమా రెండు గంటలు చూశాక వాళ్లే అర్థం చేసుకుంటారు. రాజా సాబ్ సినిమా గురించి అప్డేట్ తప్పకుండా ఇస్తాం. ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఇస్తున్న సపోర్ట్ మర్చిపోలేను. మీరు ఆశించిన దానికంటే గొప్పగానే రాజా సాబ్ ఉంటుందని ప్రామిస్ చేస్తున్నా” అని అన్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?