టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న మారుతి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు, ప్రభాస్‌తో చేసిన ప్రతిష్టాత్మక చిత్రం ‘రాజా సాబ్’ అనంతరం ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై తాజాగా ఒక స్పష్టత వచ్చింది, నిజానికి గత కొన్ని రోజులుగా మారుతి ఒక మెగా హీరోతో సినిమా చేయబోతున్నారని, స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయని కొన్ని వెబ్‌సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనికి తోడు కొన్ని నిర్మాణ సంస్థల పేర్లు, నిర్మాతల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి, ఈ ప్రచారం కాస్తా వైరల్ కావడంతో అభిమానుల్లో అయోమయం నెలకొంది.
Also Read:Allari Naresh: అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం
తాజా సమాచారం ప్రకారం, మారుతి తదుపరి సినిమా గురించి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తలన్నీ కేవలం పుకార్లు మాత్రమే, అవి పూర్తిగా నిరాధారమైనవని, అందులో ఎటువంటి వాస్తవం లేదని ఆయన పీఆర్ టీమ్ ప్రకటించింది, కేవలం క్లిక్ బైట్స్ కోసం లేదా అంచనాల కోసం సృష్టించిన వార్తలుగా వీటిని పరిగణించాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. మారుతి తన ప్రతి ప్రాజెక్టును చాలా ప్లాన్డ్‌గా అనౌన్స్ చేస్తుంటారు, కవేళ తన తదుపరి సినిమా ఖరారైతే, ఆ వివరాలను ఆయన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా, సంబంధిత నిర్మాణ సంస్థల అధికారిక ప్రకటనల ద్వారా వెల్లడిస్తారు అని పేర్కొన్నారు. అనధికారిక మార్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని షేర్ చేయడం వల్ల అనవసరమైన గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని మారుతి సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.