Aarya Ghare: సాధారణంగా సెలబ్రిటీలు తమ పుట్టినరోజును ఏ బీచ్ ఒడ్డునో, ఏ పోష్ పబ్ లోనో జరుపుకుంటారు. ఇంకా మరికొంతమంది ఇక పుట్టినరోజు గుడికి వెళ్లి తన జీవితంలో అంతా మంచిగా ఉండాలని ప్రార్థిస్తారు. అయితే వీటికి విరుద్ధంగా ఒక నటి స్మశానంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకొంది. ఆమెకేమైనా పిచ్చి పట్టిందా..? ఎక్కడా ప్లేస్ దొరకనట్లు స్మశానంలో పుట్టినరోజు జరుపుకోవడమేంటి..? ఎవరా నటి..? అని అనుకుంటున్నారా.. ఆమె పేరు ఆర్యా ఘారే. బాలీవుడ్ నటి. బాలనటిగా కెరీర్ ను ప్రారంభించిన ఆర్య ప్రస్తుతం హీరోయిన్ గా మరాఠీలో రాణిస్తోంది. ఇక నిన్న ఆమె తన 22 వ పుట్టినరోజును జరుపుకొంది. అయితే అందరిలా ఇంట్లోనో, పబ్ లోనో కాకుండా స్మశానంలో జరుపుకొంది. అందుకు కారణం కూడా ఉందని చెప్పుకొచ్చింది.
ఆమె ప్రస్తుతం మూఢ నమ్మకాలకు విరుద్ధంగా ఒక సినిమాలో నటిస్తోంది. ఆ ప్రమోషన్స్ కూడా కలిసివస్తాయని మూఢ నమ్మకాలను నమ్మకండి అంటూ ప్రజలకు తెలుపుతూ ఆమె స్మశానంలో పుట్టినరోజు జరుపుకొంది. మహారాష్ట్ర, పూణె లోని పింప్రి చించ్ వడ్ లోని ఓ స్మశాన వాటికలో ఆర్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు డైరెక్టర్స్, ఆమె తల్లి, స్నేహితులు హాజరయ్యారు. ఇదంతా బాగానే ఉంది కానీ, ఇలాంటి పనులు మరెప్పుడు చేయొద్దని నెటిజన్లు అమ్మడికి సలహాలు ఇస్తున్నారు. మూఢ నమ్మకాలు లేవు అని నమ్మించడానికి ఇలాంటి పనులు చేయొద్దని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇంకొందరు మంచి పని చేశావ్ .. ఇలాంటి మూఢ నమ్మకాల వలనే స్మశానం అంటే పెద్ద దెయ్యాల అడ్డాగా చూస్తున్నారు. ఈ కాలంలో కూడా దెయ్యాలు, భూతాలు ఏంటి అంటూ చెప్పుకోస్తున్నారు. ఏదిఏమైనా ఆర్యా బర్త్ డే సెలెబ్రేషన్స్ ప్రస్తుతం మరాఠీ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి.