పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రామాయణం కథతో అని చెప్పి ఫ్యాన్స్ ను నిరాశ పరిచారు.. డైరెక్టర్ ఓం రౌత్ ను ఫ్యాన్స్, నెటిజన్లు ఎంతగా ఆడుకున్నారో మనం చూసే ఉన్నాం.. ఆ సినిమా రైటర్ మనోజ్ ముంతాషిర్ అయితే దారుణంగా ట్రోల్స్ చేశారు.. ఇప్పుడు మరోసారి ఆ రైటర్ వార్తల్లో నిలిచాడు.. తాజాగా ఆయన ఒక ఖరీదైన కారును కొనుగోలు చేశాడు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఇక బాలీవుడ్‌లోని టాప్ రైటర్స్‌లో మనోజ్ ముంతాషిర్ ఒకరు. ‘తేరే మిట్టి’, ‘గల్లియన్’, ‘కౌన్ తుజే’ లాంటి కల్ట్ సాంగ్స్ రాసింది ఈయనే. అలానే ‘బాహుబలి’ హిందీ వెర్షన్ కోసం కూడా ఈయన పనిచేశారు. అయితే ఈ సినిమాలో ఆంజనేయుడి పాత్రకు రాసిన డైలాగులపై దారుణమైన ట్రోల్స్ ను ఎదుర్కొన్నారు.. ప్రేక్షకులు ఈయన్ని ఓ రేంజులో ఆడుకున్నారు.. దాదాపు ఈయనను అందరూ మర్చిపోయారు.. తాజాగా ఖరీదైన మెర్సిడెజ్ మేబ్యాచ్ ఎస్-క్లాస్ బెంజ్ కారు కొనుగోలు చేశారు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.2.71 కోట్లు వరకు ఉంటుందని టాక్. ఖర్చులన్నీ కలిపి చూసుకుంటే దాదాపు రూ.3 కోట్ల విలువైన కారుగా అంచనా..
ఈ కారును బాలీవుడ్ లో అతి తక్కువ మంది మాత్రమే వాడుతున్నారు.. అందులో షాహిద్ కపూర్, కంగనా రనౌత్, కియారా అడ్వాణీ, ప్రియాంక చోప్రా, అనిల్ కపూర్ లాంటి పెద్ద స్టార్స్ మాత్రమే ఈ కారుని వాడుతున్నారు.. ఇప్పుడు మనోజ్ కూడా ఆ కారును కొనుగోలు చేశారు.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.