Manchu Manoj: మంచు కుటుంబంలో అంతో ఇంతో ట్రోల్ కు గురికాని హీరో అంటే మంచు మనోజ్ అని చెప్పొచ్చు. అభిమానులకు చాలా దగ్గరైన హీరోగా మనోజ్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అనవసరంగా మాట్లాడడు.. స్నేహానికి ప్రాణం ఇస్తాడు అని అభిమానులు మనోజ్ గురించి చెప్పుకొస్తారు. ఇక గత కొన్నేళ్లుగా మనోజ్ కెరీర్ అగమ్య గోచరంగా ఉన్న విషయం తెల్సిందే. పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన సినిమాలకు దూరమైన మనోజ్.. వాటిని మొత్తం క్లియర్ చేశాడు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి.. తాను ప్రేమించిన భూమా మౌనికను రెండో వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం మనోజ్ కెరీర్ పై ఫోకస్ పెట్టాడు. ఇక మనోజ్ చేతిలో రెండు సినిమాలు.. ఒక షో ఉన్నాయి. అహం బ్రహస్మి, వాట్ ది ఫిష్ తో పాటు ఈటీవీ కోసం ఒక షో చేస్తున్నాడు.
Rambha: విజయవాడ పిల్ల.. మళ్లీ వస్తుందట.. ?
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా మనోజ్ దంపతులు.. ముఖేష్ అంబానీ వేడుకలో సందడి చేశారు. రీసెంట్ గా అంబానీ జియో వరల్డ్ ప్లాజా లాంచ్ చేశాడు. ముంబైలో జరిగిన ఈ వేడుకలో సెలబ్రిటీస్ మొత్తం హాజరయ్యారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని లేకుండా హీరోయిన్స్ అందరూ విచ్చేయడంతో.. ఆ ఈవెంట్ కన్నుల పండుగగా కనిపించింది. ఇక ఈ కార్యక్రమంలో మనోజ్ దంపతులు హైలైట్ గా నిలిచారు. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో ఇద్దరు అదరగొట్టారు. అంబానీతో వీరు కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన మనోజ్ ఫ్యాన్స్.. అది మనోజ్ అన్న రేంజ్ అంటే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.