Manjummel Boys to Release in Telugu : మలయాళ సినీ పరిశ్రమలో 2024 ఫిబ్రవరి ఒక మరపురాని ఘట్టంగా నిలవనుంది. ఎందుకంటే ఈ నెలలో రిలీజ్ అయిన సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి చర్చనీయాంశంగా మారాయి. అద్భుతమైన టాక్ తెచ్చుకోవడమే కాదు మైండ్ బ్లాక్ అయ్యే కలెక్షన్లు కూడా రాబట్టి ఈ సినిమాలు కేరళ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు, టాలీవుడ్‌ని కూడా ఆకర్షించాయి. మలయాళంలో వచ్చిన భ్రమ యుగం సినిమాను ఇప్పటికే తెలుగులో రిలీజ్ చేశారు. ఇక ప్రేమలు హైదరాబాద్‌లో ఘనవిజయం సాధిస్తున్న క్రమంలో దాన్ని మార్చి 8, 2024న తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ ఈ చిత్రాన్ని తెలుగులో మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మరో మలయాళంలో హిట్ అయిన మంజుమ్మెల్ బాయ్స్ తెలుగులోకి డబ్ అయ్యే సమయం వచ్చేసింది. మంజుమ్మెల్ బాయ్స్ తెలుగు విడుదల తేదీ ఇప్పుడు లాక్ అయింది.
Save The Tigers S2: కడుపుబ్బా నవ్వించిన సేవ్ ది టైగర్స్ ఫాన్స్ కి గుడ్ న్యూస్
తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సీట్ ఎడ్జ్ సర్వైవల్ థ్రిల్లర్ తెలుగులోకి డబ్ చేయబడుతోంది. దీనిని మార్చి 15, 2024న విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తునాన్రు. ఈ చిత్రం డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఓ ప్రముఖ నిర్మాత ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్‌ని కొనుగోలు చేశారని, రానున్న రోజుల్లో ప్రమోషనల్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అంటే ఈ లెక్కన రాబోయే రెండు వారాల పాటు, మలయాళ చిత్రాలు ప్రేమలు ఆలాగే మంజుమ్మెల్ బాయ్స్ భీమా – గామి వంటి రెగ్యులర్ తెలుగు సినిమాలతో పోటీ పడనున్నాయి. మంజుమ్మెల్ బాయ్స్ అనేది కొడైకెనాల్‌కు వెళ్లి గుణ గుహను చూడాలని అనుకుని ఇబ్బందుల్లో పడే స్నేహితుల బృందం కథ. 2006లో నిజంగా జరిగిన ఘటనను ఆధారంగా చేసుకుని చిదంబరం ఎస్ పొదువాల్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే దాదాపు 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.