Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Mani Ratnam Apologizes To Fans Over Thug Life Failure

Mani Ratnam : అభిమానులకు క్షమాపణలు చెప్పిన మణిరత్నం..

Published Date :June 24, 2025 , 12:57 pm
By Mounika
Mani Ratnam : అభిమానులకు క్షమాపణలు చెప్పిన మణిరత్నం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

దిగ్గజ దర్శకుడు మణిరత్నం, లోకనాయకుడు కమల్ హాసన్ కలయికలో దాదాపు 37 ఏళ్ల విరామం తర్వాత రూపుదిద్దుకున్న చిత్రం ‘థగ్ లైఫ్’. భారీ అంచనాలతో జూన్ 5న విడుదలై తీవ్రంగా నిరాశపరిచింది. ప్రేక్షకుల అంచనాలకు అందకుండా ఉండటమే కాదు, మొదటి వారం నుంచే డిజాస్టర్‌గా ముద్రపడింది.1987లో విడుదలైన ‘నాయకుడు’ వంటి చారిత్రాత్మక విజయానికి తర్వాత మళ్లీ కమల్ హాసన్–మణిరత్నం కాంబినేషన్ రావడంతో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ట్రైలర్లు, టీజర్లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచాయి. కానీ..

Also Read : Rashmika: ధనుష్‌పై ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టిన నేషనల్ క్రష్..

విడుదల అనంతరం అసలు కథనం, స్క్రీన్‌ప్లే బలహీనంగా ఉండటంతో ప్రేక్షకులు తీవ్రంగా నిరాశ చెందారు. అందరూ ఎదురు చూసిన సినిమా, తొలిరోజే ప్రతికూల స్పందన తెచ్చుకుంది. రెండు రోజులకే థియేటర్లు ఖాళీ కావడం, అదే సమయంలో భాషా వివాదం కారణంగా కర్ణాటకలో విడుదల కాలేకపోవడం సినిమా పై తీవ్ర ప్రభావం చూపింది. సుమారు రూ.200 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. పూర్తి థియేట్రికల్ రన్‌లో కనీసం అందులో సగం కూడా వసూలు చేయలేకపోయింది. దీని వలన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిపి దాదాపు రూ.150 కోట్లకు పైగా నష్టపోయినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో దర్శకుడు మణిరత్నం తొలిసారి స్పందిస్తూ ప్రేక్షకులకు క్షమాపణలు తెలిపారు.

ఈ ఫెయిల్యూర్‌పై మొదటిసారి మౌనం వీడి మాట్లాడిన మణిరత్నం.. ‘ప్రేక్షకులు మా నుంచి మరో క్లాసిక్ చిత్రాన్ని ఆశించారు. కానీ ఆ స్థాయిలో సినిమా లేకపోవడంపై వారికి క్షమాపణలు చెబుతున్నా. మేమెప్పుడూ ‘నాయకుడు’ కంటే తక్కువ స్థాయి సినిమా చేయాలని అనుకోలేదు. ఎవరైనా ఆ సినిమా కంటే తక్కువ సినిమా చేయాలని అనుకుంటారా? అలాంటి ఉద్దేశం కూడా మాకు లేదు. మేము ‘థగ్ లైఫ్’ పై చాలా అంచనాలు పెట్టుకున్నాం. కానీ, మేం అందించిన దానికంటే ఇంకా గొప్ప కథను మీరు మా నుంచి ఆశించారని నాకు అర్థమైంది. తప్పకుండా అలాంటి మంచి కథ తో మీ ముందుకు వస్తాను’ అంటూ మణిరత్నం వివరించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kamal Haasan Thug Life
  • Mani Ratnam apology
  • Mani Ratnam emotional note
  • Mani Ratnam Kamal movie
  • Mani Ratnam next film

తాజావార్తలు

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • Crime: భార్యను చంపి పరారీ.. LPG సిలిండర్ బుకింగ్‌లో పట్టుబడ్డ నిందితుడు..

  • Rajasekhar: యూవీ క్రియేషన్స్ అంటే రాయల్ ట్రీట్మెంటు.. బైకర్ అందుకే ఒప్పుకున్నా!

  • Mijia Smart IH Rice Doger P1 4L: షియోమి అద్భుతమైన కుక్కర్‌ విడుదల.. ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకు స్మార్ట్ సొల్యూషన్

  • Tovino Thomas: బాహుబలితో మాకు లేని ప్రాబ్లెమ్.. పళ్ళి చట్టంబితో మీకు వస్తోందా?

ట్రెండింగ్‌

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions