దిగ్గజ దర్శకుడు మణిరత్నం, లోకనాయకుడు కమల్ హాసన్ కలయికలో దాదాపు 37 ఏళ్ల విరామం తర్వాత రూపుదిద్దుకున్న చిత్రం ‘థగ్ లైఫ్’. భారీ అంచనాలతో జూన్ 5న విడుదలై తీవ్రంగా నిరాశపరిచింది. ప్రేక్షకుల అంచనాలకు అందకుండా ఉండటమే కాదు, మొదటి వారం నుంచే డిజాస్టర్‌గా ముద్రపడింది.1987లో విడుదలైన ‘నాయకుడు’ వంటి చారిత్రాత్మక విజయానికి తర్వాత మళ్లీ కమల్ హాసన్–మణిరత్నం కాంబినేషన్ రావడంతో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ట్రైలర్లు, టీజర్లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచాయి. కానీ..…
Kamal Haasan: యాక్టర్ కమల్ హాసన్ లెటెస్ట్ మూవీ ‘‘థగ్ లైఫ్’’ కర్ణాటకలో వివాదాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవల ప్రమోషన్ కార్యక్రమంలో ‘‘కన్నడ తమిళం నుంచి పుట్టింది’’ అంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్ క్షమాపణలు చెప్పకుంటే రాష్ట్రంలో సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
Thug Life: కమల్ హాసన్ తన కొత్త సినిమా ‘‘థగ్ లైఫ్’’ ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘‘ కన్నడ తమిళం నుంచి పుట్టింది’’ అని కామెంట్స్ చేయడం వివాదానికి కారణమైంది. కర్ణాటకలోని ప్రజలు, పలు సంఘాలు కమల్ హాసన్ తీరును తప్పుపట్టాయి. ఆయన సినిమా విడుదలకు అనుమతించబోమని హెచ్చరించాయి. కమల్ హాసన్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పకుంటే, ఆయన సినిమా థగ్ లైఫ్‌ని రాష్ట్రంలో విడుదలకు అనుమతించబోమని కర్ణాటక ఫిలిం బాడీ హెచ్చరించింది. “ఆయన క్షమాపణ చెప్పకపోతే, థగ్…