‘పుష్ప’ ఐటమ్ సాంగ్! అక్కడ అక్క, ఇక్కడ చెల్లి!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జానపద గీతాలతో తెలుగునాట చక్కని గాయనిగా పేరు తెచ్చుకున్న మంగ్లీ, ఆ మధ్య శివరాత్రి సందర్భంగా ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ సమక్షంలో శివుని గీతాలు ఆలపించి, యావత్ భారతవనిలో గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు తెలుగు సినిమాలలోనూ పాటలు పాడి, తనకంటూ ఓ సుస్థిర స్థానం పొందింది. ఇదిలా ఉంటే మంగ్లీ ఇప్పుడు కోలీవుడ్, శాండిల్ వుడ్ లోనూ తన సత్తా చాటుతోంది. తమిళ సినిమా ‘గోల్ మాల్’లో మంగ్లీ ఇటీవల ఓ పాట పాడింది. జీవా హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు అరుల్ దేవ్ సంగీతం అందిస్తున్నాడు. పాపులర్ సింగర్ సెంధిల్ గణేశ్ తో కలిసి ఓ పాటను మంగ్లీ ఆలపించింది.
ఇక కన్నడ చిత్రసీమలోనూ మంగ్లీ హవా కొంతకాలంగా సాగుతోంది. ‘రాబర్ట్’ మూవీ కోసం మంగ్లీ పాడిన పాట అక్కడ పెద్ద హిట్ అయ్యింది. అలానే దర్శకుడు ప్రేమ్ మూవీ ‘ఏక్ లవ్ యా!’ కోసం కూడా ఇటీవల మంగ్లీ ఓ పాట పాడింది. అదీ సూపర్ హిట్టే! కన్నడ భాషను మంగ్లీ తనదైన బాణీలో పలకడం చూసి, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ‘పుష్ప’ చిత్రంలోని సమంత ఐటమ్ సాంగ్ ను మంగ్లీతోనే పాడించారు. విశేషం ఏమంటే… ఆ పాట తెలుగు వర్షన్ పాడింది మంగ్లీ చెల్లెలు ఇంద్రావతి చౌహాన్. ఇప్పటికే ఈ అమ్మాయి ‘జార్జిరెడ్డి’ చిత్రంలోనూ ఓ పాట పాడింది. అయితే సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబోలో ఐటమ్ సాంగ్ అంటే… దాని రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు! అలాంటి సాంగ్ పాడే ఛాన్స్ దక్కడం అంటే మాటలు కాదు! ఈ పాటను కన్నడంలో అక్క మంగ్లీ, తెలుగులో చెల్లి ఇంద్రావతి పాడటం గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘పుష్ప’ మూవీలో తమకు ఇలా పాట పాడే ఛాన్స్ దక్కడం పట్ల మంగ్లీ హర్షం వ్యక్తం చేస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!