జానపద గీతాలతో తెలుగునాట చక్కని గాయనిగా పేరు తెచ్చుకున్న మంగ్లీ, ఆ మధ్య శివరాత్రి సందర్భంగా ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ సమక్షంలో శివుని గీతాలు ఆలపించి, యావత్ భారతవనిలో గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు తెలుగు సినిమాలలోనూ పాటలు పాడి, తనకంటూ ఓ సుస్థిర స్థానం పొందింది. ఇదిలా ఉంటే మంగ్లీ ఇప్పుడు కోలీవుడ్, శాండిల్ వుడ్ లోనూ తన సత్తా చాటుతోంది. తమిళ సినిమా ‘గోల్ మాల్’లో మంగ్లీ ఇటీవల…