Manchu Vishnu : శివుని ఆజ్ఞతోనే ‘కన్నప్ప’ చిత్రం రూపుదిద్దుకుంటోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం భారీ ఎత్తున రూపొందుతోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25, 2025న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌ను శుక్రవారం నాడు బెంగళూరులో ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో..
Also Read : AlluArjun : బన్నీ, త్రివిక్రమ్ సినిమాకు అంతా రెడీ..
Also Read
- Kallu Mama Song: 28 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. అండర్‌వరల్డ్ యాంథమ్‌గా నిలిచిన 'కల్లు మామ' పాట
- Star Daughters Debut : కొడుకుల టాస్క్ ఫినీష్.. ఇప్పుడు కూతుళ్ల వంతు
- Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
- Leonardo DiCaprio: ఒక్క టిప్‌తో వెయిటర్ జీవితాన్ని మార్చిన 'టైటానిక్' హీరో... కన్నీళ్ళు పెట్టించిన ఉదారత
డైనమిక్ హీరో విష్ణు మంచు మాట్లాడుతూ.. ‘కన్నప్ప ప్రమోషన్స్‌ను కన్నడ నేల నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉంది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు మొదటి సారిగా కన్నప్ప చిత్రాన్ని చేశారు. ఆ తరువాత శివ రాజ్ కుమార్ గారు కూడా చేశారు. తెలుగులో స్వర్గీయ శ్రీ కృష్ణంరాజు గారు బాపు రమణ దర్శకత్వంలో కన్నప్ప చేశారు. మళ్లీ ఇప్పుడు మేం కన్నప్ప కథను చెప్పబోతోన్నాం. ఈ తరానికి కన్నప్ప ఎవరు? ఆయన కథ ఏంటి? ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏంటి? అని క్లియర్‌గా చూపించాలనే ఈ కన్నప్ప సినిమాను చేస్తున్నాం. ముఖేష్ కుమార్ సింగ్ బుల్లితెరపై ఓ లెజెండ్. మహాభారతం సీరియల్‌ను అద్భుతంగా తెరకెక్కించారు. ఇండియా నుంచి టీంను న్యూజిలాండ్‌కు తీసుకెళ్లాం. ఇతర దేశాల నుంచి కూడా టెక్నీషియన్లను తీసుకొచ్చాం. శరత్ కుమార్ గారు సెట్‌కి ఆన్ టైంకి వచ్చేవారు. ప్రభు దేవా అన్న అడిగిన వెంటనే మా ప్రాజెక్ట్ కోసం వచ్చారు. అసలు ఈ కథను అనుకున్నప్పుడు రాక్ లైన్ వెంకటేష్ గారికే ఫోన్ చేసి చెప్పాను. అద్భుతంగా ఉంటుంది చేయ్ అని ధైర్యాన్ని ఇచ్చారు. శివుని ఆజ్ఞతోనే ఈ చిత్రం ప్రారంభమైందని అనిపిస్తుంది. నాకు ఈ కన్నప్ప ఎంతో ప్రత్యేకం. ఆర్ఆర్ అవ్వక ముందే రాక్ లైన్ వెంకటేష్ గారు ఈ మూవీని చూశారు. అద్భుతంగా వచ్చిందని భరోసానిచ్చారు. ఇక ఆ శివుని ఆశీస్సులతో మేం ఏప్రిల్ 25న రాబోతోన్నామ’ని అన్నారు.
తాజావార్తలు
-
Kallu Mama Song: 28 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. అండర్‌వరల్డ్ యాంథమ్‌గా నిలిచిన ‘కల్లు మామ’ పాట
-
Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్‌పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
-
Russia Vs Ukraine: 3000కిలోల బరువున్న బాంబును విసిరింది.. యుద్ధంలో గేర్ మార్చిన రష్యా!
-
UPI MDR Charges: యూపీఐ పేమెంట్లపై ఇక ఛార్జీలు?.. కేంద్రం పరిశీలిస్తున్న కొత్త ప్రతిపాదన పూర్తి వివరాలు..!
-
El Nino: 150ఏళ్లలో తొలిసారి.. మహా విధ్వంసం తప్పదు! భయపెడుతున్న సైంటిస్టుల అంచనా
ట్రెండింగ్
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?