‘ఎవరో గెస్ చేయండి’ అంటూ మంచు విష్ణు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన చిన్న వీడియో ఒకటి సర్ప్రైజింగ్ గా మారింది. ‘మా’ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన మంచు విష్ణు తాజాగా ఈ వీడియోతో నెటిజన్ల ముందుకు వచ్చాడు. అందులో ఉన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ‘మా’ ఎన్నికలు మంచు, మెగా ఫ్యామిలీల మధ్య చిచ్చు పెట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇండస్ట్రీ రెండుగా చీలిపోయినట్లుగా అన్పిస్తోంది. కానీ అందరం కళా’మా’తల్లి బిడ్డలమే, తప్పకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్తామని ‘మా’ అధ్యక్షుడైన మంచు విష్ణు, ఆయన తండ్రి మోహన్ బాబు చెప్పారు. అన్నట్లుగానే అందరినీ కలుపుకుని వెళ్ళడానికి బాగానే ప్రయత్నం చేస్తున్నాడు.
Read Also : “మహా సముద్రం” మూడు రోజుల కలెక్షన్లు
తాజాగా జలవిహార్‌లో ‘అలయ్ బలయ్’ అంటూ నిర్వహిస్తోన్న కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కన్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులను సన్మానించారు. భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల, డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీస్ అధినేత ప్రసాద్‌రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, బయోలాజికల్-ఇ ఎండీ మహిమ దాట్ల, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణును ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సన్మానించారు.