మంచు విష్ణు హీరోగా ఈషాన్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. ఈ చిత్రంలో విష్ణు సరసన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ నటిస్తున్నారు. విష్ణు ఈ సినిమా లో గాలి నాగేశ్వరరావు అనే విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. దీంతో సినిమా పేరు కూడా గాలి నాగేశ్వరరావు అనే పెట్టనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. షూటింగ్ లో విష్ణు, సన్నీ, పాయల్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి వీరి ముగ్గురి మధ్యన జరిగే అల్లరి పనులను వీడియోలు తీసి ప్రమోషన్స్ కింద వాడుకుంటున్నారు మేకర్స్. ఇప్పటికే విష్ణు, సన్నీ లియోన్ లు కలిసి రీల్స్ చేసిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక తాజాగా ఈ సెట్ నుంచి మరో ఫోటో బయటికి వచ్చింది. తాజాగా పాయల్.. సన్నీ, విష్ణు తో కలిసి లంచ్ కు వెళ్లగా .. అక్కడ జరిగిన క్యూట్ మూమెంట్స్ ను పాయల్ కెమెరాలో బాధించింది. ఇక ఈ ఫొటోలో విష్ణు, సన్నీకి ముద్దు పెడుతుండగా పాయల్ ఫోటో క్లిక్ చేసినట్లు కనిపిస్తుంది. అయితే నిజంగానే ముద్దుపెట్టాడు ప్రయత్నించాడా..? లేక ఫోటోకు ఫోజు ఇచ్చాడా..? అనేది తెలియదు కానీ ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు.. ఆహా విష్ణు అన్నా.. ఫుల్ రొమాంటిక్ అని కొందరు.. విష్ణు అన్న వెరీ నాటీ.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి గత కొన్నేళ్లుగా ప్లాపులను చవిచూస్తున్న మా ప్రెసిడెంట్ ఈ సినిమాతోనైనా హిట్ అందుకొని ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.