Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ జూన్ 27న రాబోతోంది. వరుసగా ప్రమోషన్లు చేస్తున్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కన్నప్ప నుంచి మరో మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో కన్నప్ప షూటింగ్ కు సంబంధించిన కొన్ని విజువల్స్ చూశారు. మెయిన్ గా విష్ణు యాక్ష్మన్ సీన్లు, హీరోయిన్ తో సాంగ్, ఇతర సీన్లను చూపించారు. చివరలో ప్రభాస్ మేకింగ్ వీడియోను చూశారు. గ్రీన్ మ్యాట్ వేసిన సెట్ లో ప్రభాస్, విష్ణు సీన్ చేస్తున్న విజువల్ ఉంది.
Read Also : Tamil Audience : తెలుగు సినిమాలపై ఏడుపు.. తమిళ తంబీలు మారరా?
ఇది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కన్నప్ప షూటింగ్ దాదాపు న్యూజిలాండ, ఇతర ప్రాంతాల్లోనే చేశారు. పచ్చని కొండ ప్రాంతాల్లో ఈ షూట్ ను చేశారు. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ నటించారు. వీరు ఇప్పటి వరకు ప్రమోషన్లలో పాల్గొనలేదు. కారణం ఏంటో తెలియట్లేదు గానీ.. చివరకు ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా రావట్లేదు. అదే ఇప్పుడు అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఈ విషయంపై ఇప్పటి వరకు విష్ణు స్పందించలేదు. మొన్న కేరళలో మోహన్ లాల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. కానీ మళ్లీ ఎక్కడా కనిపించకుండా పోయారు. మరి రిలీజ్ సమయానికి ఏమైనా కనిపిస్తారో లేదో చూడాలి.
Read Also : Samantha : వాళ్ల మాటలు పట్టించుకోవద్దు.. సమంత పోస్ట్
