Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Manchu Mohan Babu Birthday Special

Manchu Mohan Babu: భక్తవత్సలం నాయుడు.. మోహన్ బాబుగా ఎలా మారాడు.. ?

Published Date :March 19, 2024 , 3:25 pm
By Roja Pantham
Manchu Mohan Babu: భక్తవత్సలం నాయుడు.. మోహన్ బాబుగా ఎలా మారాడు.. ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Manchu Mohan Babu: భక్తవత్సలం నాయుడు.. ఈ జనరేషన్ లో ఈ పేరు చాలా తక్కువమందికి తెలుసు. అదే మోహన్ బాబు అని చెప్పండి.. టక్కున కలెక్షన్ కింగ్ అని చెప్పేస్తారు. సరే ఇంతకు భక్తవత్సలం నాయుడు.. ఎవరు అని అడుగుతారా.. మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడే. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పేర్లు మార్చుకోవడం చూస్తూనే ఉంటాం. అలా భక్తవత్సలం నాయుడు.. కాస్తా మోహన్ బాబుగా మారారు. అసలు ఎలా ఒక పిటీ టీచర్.. కలెక్షన్ కింగ్ గా మారారు అనేది తెలుసుకుందాం. చిత్తూరు జిల్లాలోని మోదుగు పాలెంలో ఓ సామాన్య మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు మోహన్ బాబు. ఆయన తండ్రి ఓ పాఠశాల పంతులు. ఇంట్లో పెద్దవాడు మోహన్ బాబు. తమ్ముళ్ళు ,చెల్లెళ్ళు ఉన్నారు. తండ్రి సంపాదించే జీతంతోనే ఇల్లు గడవడం కష్టమని భావించారు. దాంతో ప్లస్ టూ పాస్ కాగానే, ఫిజికల్ ఎడ్యుకేషన్ లో శిక్షణ తీసుకున్నారు. మద్రాసు వెళ్ళి అక్కడ ఓ పేరున్న ఉన్నత పాఠశాలలో పి.ఇడి.గా పనిచేశారు. అక్కడి వాతావరణం నచ్చక సినిమా రంగంలో అడుగుపెట్టారు. కొందరు దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు. కొన్ని సినిమాల్లో బిట్ రోల్స్ లో కనిపించారు. అలా సాగుతున్న భక్తవత్సలం నాయుడు జీవితాన్ని దాసరి నారాయణరావు రూపొందించిన స్వర్గం-నరకం చిత్రం మలుపు తిప్పింది. ఆ సినిమాతోనే భక్తవత్సలం నాయుడు కాస్తా మోహన్ బాబుగా పరిచయం అయ్యారు. ఆ తరువాత నుంచి దాసరి నారాయణరావు రూపొందించిన పలు చిత్రాలలో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ అనతికాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించారు. ఆపైన బాపు, కె.రాఘవేంద్రరావు వంటి దర్శకులు సైతం మోహన్ బాబుకు తగిన పాత్రలు ఇచ్చారు. ఆ రోజుల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా మోహన్ బాబు పలు పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఆయన నోటి నుంచి వచ్చే రైమింగ్ వర్డ్స్ ఎంతో ఫేమస్ అయ్యాయి.

మోహన్ బాబులోని విలక్షణతను గుర్తించిన ఆయన గురువు దాసరి నారాయణరావు, కేటుగాడు చిత్రంతో హీరోని చేశారు. ఆ తరువాత మరికొన్ని చిత్రాలలో హీరోగా నటించిన మోహన్ బాబుకు, అవేవీ అంతగా అలరించలేదు. దాంతో సొంతగా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంస్థను స్థాపించి, తొలి ప్రయత్నంగా ప్రతిజ్ఞ చిత్రాన్ని నిర్మించి, నటించారు. అప్పటి నుంచి మోహన్ బాబు తన సొంత సంస్థలో పలు చిత్రాలు నిర్మిస్తూ హీరోగా సాగారు. అయితే మధ్యలో మళ్ళీ ఆయనను పరాజయాలు పలకరించాయి. అప్పుడు మళ్ళీ తనదైన అభినయంతో అలరించసాగారు. ముఖ్యంగా కామెడీ విలన్ గా మోహన్ బాబు విజయయాత్ర చేశారు. ఇక తన బ్యానర్ లో తాను హీరోగా కాకుండా, ఇతరులతో చిత్రాలు నిర్మించాలని భావించారు. ఆ సమయంలోనే మళయాళంలో ఘనవిజయం సాధించిన చిత్రం సినిమాను రీమేక్ చేయాలని రైట్స్ తీసుకున్నారు. వేరే హీరోను పెట్టి, తాను నిర్మాతగా వ్యవహరించాలనుకున్నారు. అయితే అది వర్కవుట్ కాలేదు. దాంతో సన్నిహితుల సలహా మేరకు మళ్ళీ తానే హీరోగా మేకప్ వేసుకొని నటించారు. ఆ చిత్రమే అల్లుడుగారు.. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన అల్లుడుగారు మంచి విజయం సాధించింది. ఆ తరువాత మళ్ళీ తన సొంత సంస్థలో చిత్రాలు నిర్మిస్తూ సక్సెస్ రూటులో సాగారు.

ఇక మోహన్ బాబును కలెక్షన్ కింగ్ గా మార్చింది మాత్రం అసెంబ్లీ రౌడీ. ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డులు సృష్టించింది. ఈ మూవీ తర్వాత మోహన్ బాబు ఖాతాలో కలెక్షన్ కింగ్ అనే టైటిల్ చేరింది. టైటిల్ కి తగ్గట్టుగానే ఆ తర్వాత పలు చిత్రాలలో మోహన్ బాబు మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వసూలు చేశాయి. ఇక దీని తరువాత ఇటు సొంత చిత్రాలతోనూ, అటు బయటి సినిమాల్లోనూ మోహన్ బాబు హీరోగా విజయభేరీ మోగించారు. ఇక ఆ సమయంలోనే ఎన్టీఆర్ తో మేజర్ చంద్రకాంత్ సినిమా తీసి మెప్పించాడు. మనదేశంలో నటనిర్మాతగా అత్యధిక చిత్రాలు నిర్మించిన ఘనత మోహన్ బాబు సొంతం. దాదాపు నలభైకి పైగా చిత్రాలు నిర్మించి, నటించారాయన. ఆ రికార్డు ఇప్పటికీ ఆయన పేరు మీదే ఉంది. కేవలం సినిమాలతోనే కాకుండా విద్యానికేతన్ తో కూడా మోహన్ బాబు అందరి మన్ననలు అందుకున్నాడు. చదువు విలువ తెల్సిన ఆయన.. ఎంతోమందిని చదివించడానికి విద్యానికేతన్ పేరుతో ఒక స్కూల్ ను ప్రారంభించాడు. కులమతాలకు అతీతంగా అందరినీ ఒకేలా చూసే ఆదర్శ విద్యాలయాన్ని నెలకొల్పారు. ఆ విద్యాలయం నేడు ఉన్నత విద్యలకు నెలవుగా మారింది. తెలుగునేలపై అత్యుత్తమ విద్యాలయాల్లో ఒకటిగా వెలుగొందుతోంది. విల‌న్ గా.. స‌హాయ న‌టుడిగా.. హీరోగా.. నిర్మాతగా.. రాజ‌కీయ నాయ‌కుడిగా.. విద్యా సంస్థ‌ల అధినేత‌గా .. బ‌హుముఖ ప్ర‌జ్ఞ క‌న‌బ‌రిచిన అరుదైన ప్ర‌తిభావంతుడిగా మోహ‌న్ బాబుకు అభిమానులు ఉన్నారు. జీవితంలో కష్టనష్టాలను ఓర్చి, విజయాపజయాలను చూసి.. ఇప్పుడు కుమారుడు విష్ణుకు తోడుగా ఉంటున్నాడు. నేడు ఆయన 72 వ పుట్టినరోజు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని మరిన్ని విజయాలను అందుకోవాలని ఆశిస్తూ.. హ్యాపీ బర్త్ డే మంచు మోహన్ బాబు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • collection king Manchu Mohan Babu
  • happy birthday Manchu Mohan Babu
  • manchu mohan babu
  • Tollywood News

తాజావార్తలు

  • Shreyas Iyer: ‘సర్పంచ్ సాబ్’.. శ్రేయస్ అయ్యర్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

  • Jasprit Bumrah: పిచ్చినవ్వు.. భూమిని తన్నడం.. బుమ్రాను ఇలా ఎప్పుడూ చూడలేదు బ్రో..(వీడియో)

  • Adivi Sesh: ఒకరిని 150 మంది కలిపి కొట్టారు.. డెకాయిట్ బయటకు రప్పించింది!

  • Toyota Yaris Cross facelift: టయోటా యారిస్ క్రాస్ 2026 ఫేస్‌లిఫ్ట్.. కొత్త లుక్, హైబ్రిడ్ మ్యాజిక్!

  • Rythu Bharosa: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఎల్లుండే ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు..

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions