Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు ఫ్యామిలీలో వివాదాలు ఇంకా సద్దుమణగలేదా? అన్నదమ్ముల మధ్య గ్యాప్ ఇంకా అలాగే ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా మంచు మనోజ్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. తన ప్రీ-బర్త్ డే వేడుకల్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన మనోజ్.. తనదైన శైలిలో సెటైరికల్ గా వేసిన పంచులకు విలేకరులు సైతం ఒక్కసారిగా అవాక్కయ్యారు. తన పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ మీడియాతో సరదాగా ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఒక రిపోర్టర్.. “మీ ఫ్యామిలీ ఇష్యూస్ క్లియర్ అయినట్టేనా?” అని అడిగారు. దీనికి మనోజ్ ఏమాత్రం తడుముకోకుండా ఊహించని రేంజ్ లో రిప్లై ఇచ్చారు. “ఆ విషయం గురించి ఎవరిని అడగాలో మీకు తెలుసుగా? వెళ్లి వారిని అడగండి. కాకపోతే నాదొక చిన్న సలహా.. వెళ్లేటప్పుడు చేతిలో మైక్ పట్టుకుని వెళ్లొద్దు, సేఫ్టీ కోసం తలకి హెల్మెట్ పెట్టుకుని మరీ వెళ్లండి” అంటూ నవ్వుతూనే సెన్సేషనల్ బాంబ్ పేల్చారు.
మనోజ్ చేసిన ఈ ‘హెల్మెట్’ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ కౌంటర్ పరోక్షంగా తన అన్నయ్య మంచు విష్ణుని ఉద్దేశించే అన్న విషయం అందరికీ అర్థమవుతోంది. గతంలో మంచు విష్ణు vs మంచు మనోజ్ ఇష్యూ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. మనోజ్ ఇలా పరోక్షంగా సెటైర్లు వేయడం చూస్తుంటే మంచు బ్రదర్స్ మధ్య ఇంకా ‘కోల్డ్ వార్’ నడుస్తూనే ఉందని స్పష్టమవుతోంది. ఏది ఏమైనా, ఎలాంటి ఫిల్టర్ లేకుండా తనదైన స్టైల్ లో సింపుల్ గా నవ్వుతూ మనోజ్ వేసిన ఈ ‘హెల్మెట్’ సెటైర్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. విలేకరులకు మైక్ బదులు హెల్మెట్ ఎందుకు సజెస్ట్ చేశాడో నెటిజన్లకు ఇట్టే అర్థమైపోవడం గమనార్హం.
Also Read
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!