Manchu Manoj: మంచు కుటుంబంలో విబేధాలు నెలకొన్నాయి అనేది ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. మనోజ్ భూమా మౌనికను ప్రేమించడం, ఆమెతో పెళ్లి గురించి మంచు ఇంట గొడవలు జరగడం, దీంతో మంచు మనోజ్ మంచు కుటుంబానికి దూరమయ్యాడు అని వార్తలు వస్తున్నాయి. తండ్రి మాట జవదాటని విష్ణు సైతం తమ్ముడు మనోజ్ తో మాట్లాడం లేదని టాక్ నడుస్తోంది. ఇదంతా జరిగి రెండు నెలలు కావొస్తోంది. ప్రస్తుతం మంచు మనోజ్, తల్లితండ్రులతో కలిసి ఉండడం లేదట. అయితే తాజాగా మంచు మనోజ్ పనులు చూస్తుంటే మళ్లీ మంచు కుటుంబంతో బంధం కలుపుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
అసలు సంగతి ఏంటంటే.. ఇటీవలే మంచు విష్ణు పుట్టినరోజును జరుపుకున్న విషయం తెల్సిందే. ఆ రోజు జంబలకిడి జారు మిఠాయ సాంగ్ పాడించి మరీ మనోజ్, విష్ణుకు విషెస్ చెప్పాడు. తమ్ముడు చెప్పిన విషెస్ కు కనీసం విష్ణు స్పందించింది లేదు. తనకు విష్ చేసినవారందరికి థాంక్స్ చెప్పిన విష్ణు కనీసం తమ్ముడికి థాంక్స్ అని కూడా చెప్పలేదు. ఇక నేడు మంచు విష్ణు కుమార్తెలు అరియనా, వివియానా బర్త్ డే కావడంతో బాబాయ్ గా ఇద్దరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇక దీనికి కూడా మంచు కుటుంబం నుంచి రెస్పాన్స్ లేదు. మనోజ్ ఎంత దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నా మంచు కుటుంబం అతనిని దూరం పెడుతూనే ఉందని చెప్పుకొస్తున్నారు. ఇంకొంతమంది అన్నదమ్ములు సోషల్ మీడియాలోనే మాట్లాడుకోవాలని రూల్ ఉందా..? బయట మాట్లాడుకుంటున్నారేమో అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలి.