Manchu Manoj : మంచు మనోజ్ స్టార్ హీరోయిన్ కు సారీ చెప్పాడు. అది కూడా అందరి ముందు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో. మనకు తెలిసిందే కదా.. తేజాసజ్జ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. ఇందులో శ్రియ కూడా నెగెటివ్ పాత్రలోనే కనిపిస్తోంది. తాజాగా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. మనోజ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో పాత్ర నిజంగా నాకు దేవుడు ఇచ్చిన వరం అనిపిస్తుంది. ఈ పాత్ర నాకు ఎంతో స్పెషల్ అంటూ తెలిపాడు.
Read Also : Prabhas vs Chiranjeevi : చిరంజీవికి ప్రభాస్ పోటీ.. ఇక రణరంగమే..
శ్రియ నాకు ఫేవరెట్ హీరోయిన్. ఆమెతో పనిచేయాలని గతంలో అనుకున్నాను. ఈ సినిమాలో మేం ఇద్దరం కలిసి నటించాం. ఆ కోరిక ఇలా తీరిపోయింది. సినిమా షూటింగ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కు నేను ఆమెకు సారీ చెబుతున్నా అంటూ నవ్వాడు మనోజ్. పక్కనే ఉన్న శ్రియ కూడా నవ్వేసింది. అయితే వీరిద్దరూ ఇందులో విలన్లుగా కనిపిస్తున్నారు. బహుషా ఇద్దరూ భార్యాభర్తలేమో అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మిరాయ్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. వీఎఫ్ ఎక్స్ కూడా క్వాలిటీగా ఉండటంతో పాటు కథ, స్క్రీన్ ప్లే కొత్తగా ఉండటం కలిసొస్తోంది. పురాణాలను బేస్ చేసుకుని ఈ సినిమా వస్తోంది. ఇందులో ప్రత్యేక శక్తులు కలిగిన వారిగా మనోజ్, తేజ కనిపిస్తున్నారు.
Read Also : Ranu Bombaiki Ranu Song : ’రాను బొంబాయికి రాను’ పాటకు ఎన్ని కోట్లు వచ్చాయో చెప్పిన లిఖిత..
