Manchu Lakshmi : నటి మంచు లక్ష్మీ చాలా గ్యాప్ తర్వాత దక్ష–ది డెడ్‌లీ కాన్సిపిరసీ’ అనే మూవీ చేసింది. ఈ సినిమా ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలపై మాట్లాడింది. ఆడవారికి అన్ని చోట్లా అడ్డంకులే క్రియేట్ అవుతున్నాయి. ఈ రకమైన బట్టలు వేసుకోవద్దు.. అలాంటి పనులు చేయొద్దంటూ రూల్స్ పెడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి మరీ ఎక్కువగా వినిపిస్తుంటాయి. అలాంటి వాటి వల్ల చాలా మందికి అవకాశాలు కూడా పోతున్నాయి అంటూ తెలిపింది.
Read Also : Manchu Lakshmi : మహేశ్ బాబును ఆ ప్రశ్న అడిగే ధైర్యం ఉందా..
మన టాలీవుడ్ లోనే ఓ హీరో మాజీ భార్య నాతో తన బాధ చెబుతూ చాలా ఎమోషనల్ అయింది. ఆమెకు సినిమాలు కన్ఫర్మ్ అయిన తర్వాత.. ఆమె మాజీ భర్త ఏమైనా అనుకుంటాడేమో అని నిర్మాతలు వద్దు అని క్యాన్సిల్ చేసుకుంటున్నారంట. కావాలనే ఆమెకు ఛాన్సులు ఇవ్వట్లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది మంచు లక్ష్మీ. కానీ వాళ్ల పేర్లు మాత్రం బయటకు చెప్పలేదు. దీంతో ఎవరా హీరో.. ఎవరా హీరోయిన్ అంటూ చర్చించుకుంటున్నారు. ఏదేమైనా మంచు లక్ష్మీ ఈ నడుమ చేస్తున్న కామెంట్లు ఇలా రచ్చకు దారి తీస్తున్న విషయం తెలిసిందే.
Read Also : Teja Sajja : తేజసజ్జా ఆ హీరోల లిస్టులో చేరిపోయాడోచ్..
