‘మనసానమః’ ఆస్కార్‌కు అర్హత సాధించిన మొట్టమొదటి తెలుగు చిత్రం. ఈ చిత్రం ఇప్పుడు అకాడమీ సభ్యుల ఓటింగ్ కోసం ప్రదర్శితం అవుతోంది. నూతన దర్శకుడు దీపక్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్ 2020లో విడుదలైంది. అప్పటి నుండి 950+ అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. 300+ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శితం అయ్యింది. ఆస్కార్ బరిలో నిలిచిన ఈ చిత్రం గురించి మేకర్స్ స్పందిస్తూ “ఆస్కార్ కోసం పోటీ పడుతున్న సినిమాల్లో ‘మనసానమః’ ఉండడం గర్వకారణం. ఈ అచీవ్మెంట్ ను గౌరవంగా భావిస్తున్నాము. ఆస్కార్ కోసం బరిలో ఉన్న అన్ని సినిమాలను దాటుకుని తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటి ఆస్కార్‌ను సాధిస్తుందని ఆశిస్తున్నాము” అని అన్నారు. మరి ఇన్ని అవార్డులు గెలుచుకున్న ఈ మూవీని ఆస్కార్ వరిస్తుందో లేదో చూడాలి.
Read Also : మిస్టర్ బీన్ ఇక లేరు… ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ ఘనకార్యం