Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former Miss India: మాజీ మిస్ ఇండియా, తెలుగు మానస వారణాసి టాలీవుడ్లో తన కెరీర్‌ను మరింత బలపర్చుకునేందుకు మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘దేవకీ నందన వాసుదేవ’తో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన మానసకు.. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామాలో మానస నటనకు మంచి స్పందన లభించింది. ‘కపుల్ ఫ్రెండ్లీ’ తర్వాత మానసకు వరుసగా అవకాశాలు వస్తాయని చాలామంది భావించారు. అయితే సినిమా విడుదలై సుమారు ఆరు నెలలు అవుతున్నా ఆమె కొత్త సినిమాకు సైన్ చేసినట్లు అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు. ఇదే సమయంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’లో మానస స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ అవకాశం శ్రుతి హాసన్‌కు దక్కినట్లు తర్వాత ప్రచారం జరిగింది.
అవకాశాలు తగ్గడంతో మానస సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోషూట్లు, గ్లామర్ కంటెంట్‌తో ప్రొఫైల్‌ను మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమెకు ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ దక్కినట్లు సమాచారం. శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జార్జ్ క్రిష్’ సినిమాలో మానస వారణాసి హీరోయిన్గా ఎంపికైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్నప్పటికీ.. తాజాగా ఆమె ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు సమాచారం. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్. ఇప్పటికే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ‘జార్జ్ క్రిష్’తో మానసకు ఎలాంటి గుర్తింపు వస్తుంది? ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస అవకాశాలు దక్కుతాయా? అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
- Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
- King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
- Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
- Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
తాజావార్తలు
-
Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్‌కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
-
Khelo India : తెలంగాణలో ఖేలో ఇండియా.. 6 వేల మంది క్రీడాకారుల సందడి
-
Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్‌లో వరద విలయం.. 105 మంది భారతీయులు గల్లంతు..
-
Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..