Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Silver Cleaning Trick: రక్షాబంధన్ పండుగ సమీపిస్తున్న వేళ చాలామంది తమ వెండి కాలి గొలుసులు, గాజులు, ఇతర ఆభరణాలను బయటకు తీస్తుంటారు. అయితే ఎక్కువ కాలం లాకర్ లేదా పెట్టెల్లో భద్రపరిచిన వెండి ఆభరణాలు నల్లగా మారడం సాధారణమే. దీంతో వాటి అసలు మెరుపు తగ్గిపోతుంది. అలాంటి సమయంలో వెంటనే నగల దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఇంట్లోనే సులభంగా లభించే కొన్ని వస్తువులతో వెండి ఆభరణాలను శుభ్రం చేసుకునే చిట్కాను వాళ్లు పంచుకున్నారు. సింపుల్‌గా 20 నిమిషాల్లో మీ వెండి ఆభరణాలపై ఉన్న నలుపు మరకలను ఎలా పోగొట్టుకోవాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన వస్తువులు
* పెద్ద గిన్నె
Also Read
- Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
* అల్యూమినియం ఫాయిల్
* వేడి నీరు
* 1-2 టీస్పూన్ల ఉప్పు
* 1-2 టీస్పూన్ల బేకింగ్ సోడా
* మృదువైన, పొడి వస్త్రం
వెండి ఆభరణాలను ఎలా శుభ్రం చేయాలంటే..
ముందుగా పెద్ద గిన్నె అడుగున అల్యూమినియం ఫాయిల్‌ను పరచాలి. అందులో వేడి నీటిని పోసి, 1-2 టీస్పూన్ల ఉప్పు, 1-2 టీస్పూన్ల బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. అనంతరం నల్లగా మారిన వెండి కాలి గొలుసు లేదా ఇతర ఆభరణాన్ని ఆ ద్రావణంలో పూర్తిగా ముంచాలి. ఆభరణాన్ని సుమారు 20 నిమిషాల పాటు అందులో ఉంచాలి. ఆ తర్వాత వాటిని బయటకు తీసి మెత్తని, పొడి వస్త్రంతో నెమ్మదిగా తుడవాలి. ఇలా చేయడం వల్ల వెండి ఆభరణాలపై నల్లటి మరకలు తగ్గి, తిరిగి మెరిసేలా చేయడంలో సహాయపడుతుందని వెల్లడించారు.
ఈ ట్రిక్ ఎలా పనిచేస్తుందంటే..
అల్యూమినియం ఫాయిల్, ఉప్పు, బేకింగ్ సోడా, వేడి నీటితో జరిగే రసాయన చర్య వెండి ఆభరణాలపై ఏర్పడిన నల్లటి పొరను తొలగించడంలో సహాయపడుతుందని వెల్లడించారు. దీంతో ఎక్కువగా రుద్దాల్సిన అవసరం లేకుండానే వెండి మెరుపును కొంతవరకు తిరిగి తీసుకురావచ్చని చెబుతున్నారు. అయితే అన్ని వెండి ఆభరణాలకు ఈ పద్ధతి సరిపోదట. పురాతనమైనవి, చాలా సున్నితమైనవి, ముత్యాలు లేదా విలువైన రాళ్లు పొదిగిన వెండి ఆభరణాలను ఈ ద్రావణంలో వేయకపోవడం మంచిదని సూచిస్తున్నారు. అలాంటి వాటిని శుభ్రం చేసే ముందు నగల నిపుణుడి సలహా తీసుకోవాలని చెబుతున్నారు. క్లీన్ చేసిన తర్వాత ఆభరణాలను పూర్తిగా ఆరబెట్టి, తేమకు దూరంగా గాలి చొరబడని డబ్బాలో భద్రపరిస్తే మళ్లీ త్వరగా నల్లబడకుండా ఉంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
-
Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..