Mamitha Baiju: ఆ డైరెక్టర్ నన్ను సెట్ లో అందరి ముందు కొట్టాడు.. హీరో సూర్య కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamitha Baiju: కొందరు డైరెక్టర్లకు పర్ఫెక్షన్ అనేది చాలా ముఖ్యం. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా వారు తిట్టడంతో ఆగరు.. నటీనటులని కూడా చూడకుండా చేయెత్తుతారు. తెలుగులో డైరెక్టర్ తేజ.. తన దర్శకత్వంలో నటించిన హీరో హీరోయిన్లందరిని కొట్టినవాడే. ఇప్పుడు ఆయన స్కూల్ నుంచి వచ్చిన హీరోలందరూ స్టార్లుగా మారారు. ఇక ఇప్పుడు వారిని అడిగినా ఆయన పర్ఫెక్ట్ గా సీన్ రావడం కోసం ఏదైనా చేస్తారు అని చెప్తారు.ఇక తేజ లానే తమిళ్ లో డైరెక్టర్ బాలా కూడా నటీనటులను కొడతారని టాక్. తాజాగా ఒక యంగ్ హీరోయిన్ అందరిముందు బాలా తనను తిట్టి, కొట్టినట్లు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఇలాంటి విషయాలు స్టార్ డమ్ రాకముందు చెప్తే.. ఎవరు నమ్మరేమో కానీ, ఒక్కసారి ఒక్క హిట్ పడ్డాకా చెప్తే మాత్రం అందరూ నమ్మేస్తారు. ఇప్పుడు ఆ హీరోయిన్ కూడా అదే పని చేసింది. అసలు ఆ హీరోయిన్ ఎవరు అనేగా అందరి డౌట్.. రీసెంట్ క్రష్ మమిత బైజు. మలయాళ సినిమా ప్రేమలు చిత్రంతో అందరి మనసులను దోచుకున్న ఈ చిన్నది.. ఈ సినిమా హిట్ తరువాత.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన కెరీర్ లో జరిగిన అవమానాలను, అనుభవాలను నెమరువేసుకుంది.
మమిత ఈ సినిమా కన్నా ముందు బాలా- సూర్య కాంబోలో వచ్చిన అచలుడు అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నుంచి సూర్య, మమిత ఇద్దరూ తప్పుకున్నారు. ఇక ప్రేమలు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆ సినిమా నుంచి ఆమె ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో వివరించింది. ” ఆ సినిమాలో నేనొక మ్యూజిక్ పరికరాన్ని వాయిస్తూ ఉండాలి. ఆ సీన్ షూట్ చేస్తున్నారు. నాకు దాన్ని వాయించడం ఎలాగో తెలియదు. నేను అప్పటికే ప్రాక్టీస్ చేసిన అమ్మాయిలా నటించాలా? లేదంటే మొదటిసారి దాన్ని ప్రయత్నిస్తున్నట్లు యాక్ట్ చేయాలా? అని బాలా సర్ ను అడిగాను. ఆయన.. అనుభవం ఉన్న అమ్మాయిలా యాక్ట్ చేయాలి. వెనుక ఒక అమ్మాయి వాయిస్తుంటే.. ఆమెను చూపించి అదుగో అలా వాయించాలి అని చెప్పారు. నేను ఓకే అన్నాను. వెంటనే టేక్ అన్నారు. నేను షాక్ అయ్యాను. మూడు టేకులు తీసుకున్నాను.. వాళ్లు ఏం పడుతున్నారో అర్ధమే కాలేదు. మధ్యమధ్యలో బాలా సర్ తిడుతున్నారు. అయితే తాను టేకులో ఉన్నప్పుడు తిడతాను.. అదంతా సీరియస్ గా తీసుకోవద్దని చెప్పడంతో నేను వాటిని మనసులో పెట్టుకోలేదు. ఆ తరువాత ఆయన సెట్ లో అందరిముందు నన్ను కొట్టారు కూడా.. సూర్య సర్ కు కూడా ఇది తెలుసు. కానీ, బాలాసర్ తో ఆయన అంతకు ముందే వర్క్ చేశారు కాబట్టి ఏం చెప్పలేకపోయారు. కానీ, ఇది కొత్త” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
- Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
- Disha Salian Death Case: 'నేను ఇకపై మౌనంగా ఉండను'... దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!