SSMB 28: మహేష్ సినిమాలో తరుణ్ కాదంట.. ఆ హీరో ఫిక్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSMB 28: సూపర్ స్టార మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం SSMB28. అతడు, ఖలేజా సినిమాల తరువాత వస్తున్న చిత్రంతో ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు అభిమానులు. ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం క్యాస్టింగ్ పనిలో బిజీగా ఉన్న త్రివిక్రమ్ పాత్రకు తగ్గవారికోసం వెతుకులాట కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గత కొన్నిరోజుల నుంచి ఈ సినిమాలో హీరో తరుణ్ ఒక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్న విషయం విదితమే. తరుణ్ హీరోగా నువ్వే నువ్వే చిత్రంతో త్రివిక్రమ్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టాడు. ఇక తరుణ్ రీ ఎంట్రీ కూడా త్రివిక్రమే తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయమై ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో మరో యంగ్ హీరోకు పాత్ర ఉంది కానీ తాము తరుణ్ ను అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు.
ఇక తాజాగా తరుణ్ కూడా తనను ఎవరు సంప్రదించలేదని, ఏదైనా ఉంటే తానే డైరెక్ట్ గా చెప్తానని చెప్పుకొచ్చాడు. దీంతో ఆ పాత్రలో తరుణ్ నటించడం లేదని కన్ఫర్మ్ అయ్యింది. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం మలయాళ హీరో రోషన్ మ్యాథ్యును సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంలో రోషన్ స్టార్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక రోషన్ ఈ మధ్యనే అలియా తో కలిసి డార్లింగ్ లో నటించి మంచి హిట్ అందుకున్నాడు. నేడు రిలీజ్ అయిన కోబ్రా లో విలన్ గా నటించి మెప్పించాడు. తెలుగులో త్రివిక్రమ్ సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్నాడు ఈ హీరో.. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
Also Read
తాజావార్తలు
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!