Holy Wound: మలయాళ బిగ్ బాస్ బ్యూటీ జానకి సుధీర్, అమృతా వినోద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘హోలీవుండ్’. సహస్ర సినిమాస్ ప్రై. లి సమర్పణలో సందీప్ ఆర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ అరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే తెలుగులో లెస్బెనియన్ చిత్రంగా వర్మ తెరెక్కించిన డేంజరేస్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపర్చిన విషయం విదితమే. ఇక ఈ తరహాలోనే ‘హోలీవుండ్’ లెస్బెనియన్ చిత్రంగా రిలీజ్ కానుంది. అయితే థియేటర్లో కాకుండా ఈ సినిమాను ఓటిటీలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆగస్ట్ 12 నుంచి ఎస్ ఎస్ ఫ్రేమ్స్ అనే ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ప్రతి ఒక్కరికి శృంగార కోరికలు ఒకేలా ఉంటాయి. ఇద్దరు అమ్మాయిలు చిన్నతనం నుంచి ఒకేలా పెరిగి, ఒకేలా శృంగారం గురించి ఆలోచిస్తూ వారిద్దరూ తమ కోరికలను ఎలా తీర్చుకున్నారు..? దాని వలన వచ్చిన పరిణామాలను ఎలా ఎదుర్కొన్నారు..? అనేది సినిమా కథ అని మేకర్స్ తెలిపారు. ఇద్దరు అమ్మాయిలు తమకు నచ్చిన విధంగా శృంగారం పాల్గొనడం తప్పు కాదని తెలియజేయడమే ఈ సినిమా అని ఈ చిత్ర నిర్మాత సందీప్ తెలిపారు. తమ సినిమాను చూసి ఆదరించాల్సిందిగా కోరాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..