Anushka: టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్. అందం, అభినయం కలగలిపిన రూపం ఆమె సొంతం. ప్రయోగాలకు పెట్టింది పేరు. వ్యక్తిత్వానికి మారుపేరు.. ఆమె టాలీవుడ్ జేజేమ్మ, భాగమతి, దేవసేన.. ఏ పేరు పిలిచినా చివరికి ఆ రూపం అనుష్క గా మారుతోంది. అవును మనం మాట్లాడుకొంటుంది అనుష్క శెట్టి గురించే.. నేడు స్వీటీ పుట్టినరోజు. దీంతో ఆమెకు సోషల్ మీడియా ద్వారా అభిమానులు, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నిశ్శబ్దం సినిమా తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన స్వీటీ చాలా ఏళ్ల తరువాత యూవీ క్రియేషన్స్ లో ఆమె ఒక చిత్రంలో నటిస్తోంది. జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇక నేడు స్వీటీ బర్త్ డే కావడంతో ఆమె పోస్టర్ ను రిలీజ్ చేసి మేకర్స్ విషెస్ తెలిపారు. ఈ సినిమాలో స్వీటీ.. చెఫ్ అన్వితా రవళి శెట్టి పాత్రలో కనిపిస్తోందని తెలిపారు. ఇక పోస్టర్ లో అనుష్క ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది అని చెప్పాలి. చెఫ్ డ్రెస్ లో వంట చేస్తూ ఇంకోపక్క చిరు మందహాసం చేస్తూ కనిపించింది, ఇక స్వీటీని ఇలా చూసి ఎన్నేళ్లు అవుతోందో అని అభిమానులు ఈ ఫోటోను వైరల్ గా మార్చేశారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో స్వీటీ మళ్లీ టాలీవుడ్ లో బిజీ అవుతుందేమో చూడాలి.
Happy Birthday 🎂 Sweety ❤️
Introducing 'Anvitha Ravali Shetty' aka our beautiful actress @MsAnushkaShetty @NaveenPolishety #MaheshBabuP #NiravShah @UV_Creations #ProductionNo14 #Anushka48 #NaveenPolishetty3 pic.twitter.com/OmLLhGoawD
— UV Creations (@UV_Creations) November 7, 2022