సలార్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ కొట్టాడు డార్లింగ్ ప్రభాస్. నెక్స్ట్ పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తూ కల్కి సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898ఎడి పై భారీ అంచనాలున్నాయి. వరల్డ్ వైడ్‌గా ఊహించని రేంజ్‌లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకే… ప్రమోషన్స్‌ను హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కల్కి గ్లింప్స్‌ను హాలీవుడ్ సినిమాల తరహాలో అమెరికాలో జరిగే కామిక్ కాన్ ఈవెంట్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఇప్పుడు టీజర్‌ను కూడా హాలీవుడ్ గడ్డపైనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అమెరికాలో పలు హాలీవుడ్ సినిమాల టీజర్స్‌ని మొదటగా ప్లే చేసే హైయెస్ట్ వ్యూవర్ షిప్ కలిగిన సూపర్ బౌల్ ఈవెంట్‌లో కల్కి టీజర్‌ని ప్రెజెంట్ చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నారట.
ఒకవేళ ఇదే జరిగితే… ఇండియన్ సినిమా నుంచి వెళ్లిన మొదటి సినిమాగా కల్కి నిలుస్తుంది. అలాగే కల్కి రీచ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటుందనే చెప్పాలి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం… కల్కి టీజర్‌ను ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కల్కి మే 9న రిలీజ్ కానుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. అయితే కల్కి షూటింగ్ ఇంకా జరుగుతూ ఉండడంతో సినిమా చెప్పిన డేట్ కి రిలీజ్ అవుతుందా లేదా అనే డౌట్ అభిమానుల్లో ఉంది. మేకర్స్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం… కల్కి మే 9ని మిస్ అయ్యే ప్రసక్తే లేదు. ఈ డేట్ వైజయంతీ మూవీస్ కి చాలా స్పెషల్… పైగా ఇప్పుడు జరుగుతున్న షూటింగ్ కల్కి పార్ట్ 2కి సంబంధించినది. పార్ట్ 1 షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యిందట. పార్ట్ 1 పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలు పెట్టేసి ఉంటాడు నాగ్ అశ్విన్… సో కల్కి రిలీజ్ డేట్ మిస్ చేసే అవకాశం కనిపించట్లేదు.