సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జాక్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించారు. టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన సినిమాకావడంతో జాక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
Also Read : Megastar : మార్క్ శంకర్‌ను చూసేందుకు సింగపూర్ కు మెగాస్టార్
ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ ‘ అందరికి నమస్కారం.. టిల్లు స్క్వేర్’ తర్వాత ఎలాంటి సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేస్తే కరెక్ట్ కానీ మళ్ళి అదే సినిమా చేసాడు రా అనే మాట రాకుండా ఉండాలంటే ఏమి చేయాలనే గందరగోళంలో ఉన్నప్పుడు నిర్మాత ప్రసాద్ నా దగ్గరికి భాస్కర్ ని తీసుకు వచ్చి కథ వినిపించారు. విన్న వెంటనే టిల్లు స్క్వేర్ తర్వాత ‘నేను చేయాల్సిన సినిమా ఇదే’ అనిపించింది. వెంటనే ఓకే చేశాను. ఆరెంజ్’ నుంచి నాకు దర్శకుడు భాస్కర్‌తో అనుబంధం ఉంది. అప్పట్లో అయన నన్ను తిట్టేవాడు కూడా. కానీ ఆయన ఎప్పుడు సినిమా గురించే ఆలోచిస్తుంటారు. టిల్లు సినిమాల్లో పంచ్‌లు, వినోదం ఉండెలా నాకు స్పేస్ ఇచ్చారు భాస్కర్. ఇక ‘బేబి’ సినిమా చూసినప్పుడే ఫిక్స్ అయ్యాం. ‘జాక్’లో హీరోయిన్ వైష్ణవినే అని. తనలో ఎంతో ప్రతిభ ఉంది. ఆమె ఎక్కడికో వెళ్తుంది. ఏప్రిల్ 10 న విడుదలవుతుంది. ఆరెంజ్ లో పదేళ్ల తర్వాత కాకుండా ఇప్పుడు చూసి హిట్ చేయండి. జాక్ తప్పకుండా మీకు నచ్చుతుంది’ అని అన్నారు.